ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28 మధ్య తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటే ఛాన్స్ ఉంది. 10 జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చు. హైదరాబాద్‌లో బుధవారం 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో 41 నుండి 45 డిగ్రీల వరకు నమోదు కావచ్చు.
'తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.' అని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్‌లో వేడిగాలులు ఉండే అవకాశం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ హీట్ వేవ్స్ ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది.
సోమవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉంది. కొన్నిచోట్ల పాక్షికంగా మోఘామృతమై ఉంటుంది. పడమర, నైరుతి దిశల నుంచి 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, రామగుండంలో ఎండల తీవ్రత ఎక్కువగా నమోదైంది.
సంబంధిత కథనం
టాపిక్