TS Weather : మరో 3 రోజులు భగభగలే...! ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్-imd issues heatwave alert in telangana for three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather : మరో 3 రోజులు భగభగలే...! ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్

TS Weather : మరో 3 రోజులు భగభగలే...! ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 14, 2023 05:23 PM IST

Telangana Weather Updates: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మరో మూడు నాలుగు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణలో భానుడి భగభగలు (imd)

AP and Telangana Weather Updates: ఓవైపు నైరుతి రుతపవనాలు ఎంట్రీ ఇచ్చాయి... మృగశిర కార్తె కూడా వచ్చింది. ఏరువాక పనులు కూడా షురూ అయ్యాయి. కానీ భానుడి భగభగలు మాత్రం ఆగటం లేదు. రోజురోజుకూ పరిస్థితి మరింత తీవ్ర అవుతోంది. ఎండ తీవ్రత దాటికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే పరిస్థితి మరో మూడు నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

జూన్ 17వ తేదీ వరకు ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్గొండ, జిల్లాలతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో ఎండలు
తెలంగాణలో ఎండలు

వర్ష సూచన...

ఇక ఇవాళ్టి నుంచి గురువారం(జూన్ 15) ఉదయం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. జూన్ 17వ తేదీ తర్వాత... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 23 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిచింది.

Whats_app_banner