TS Weather: అల్పపీడనం ఎఫెక్ట్... మరో 2 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు
Weather Updates:రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
Weather Updates Telangana and AP:నైరుతి రుతుపవనాలు విస్తరించటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ తో..... విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన... ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తెలంగాణలో చూస్తే... ఉత్తర తెలంగాణలో వానలు గట్టిగా పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలోనూ అదే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.... తెలంగాణకు మరో రెండు రోజుల వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు
బుధవారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. జులై 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక హైదరాబాద్‌లో బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా... ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు బలంగా వీచే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లో 25 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి.
ఏపీలోనూ వర్షాలు….
ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రెండు రొజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక బుధవారం తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.