TS Weather Updates : ఈ 2 రోజులు మరింత చలి - ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు-imd has issued a cold wave warning for several parts of telangana for 2 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Imd Has Issued A Cold Wave Warning For Several Parts Of Telangana For 2 Days

TS Weather Updates : ఈ 2 రోజులు మరింత చలి - ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 30, 2023 06:10 AM IST

Cold Wave Alert Updates: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో మరింత చలి
తెలంగాణలో మరింత చలి (Twitter)

Telangana Weather Updates : కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రతనే కాకుండా… పొగ మంచు ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో…ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలో ఉదయం వేళల్లో అధికంగా పొగమంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

ఇక ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. చలి తీవ్రత, పొగమంచు ఎఫెక్ట్ ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో… వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచింది.

ఇక ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో దిగువ ట్రోపో ఆవరంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

WhatsApp channel