Siddipet Seeds: సిద్దిపేటలో అక్రమం నిల్వ చేసిన నకిలీ విత్తనాలు స్వాధీనం..-illegally stored fake seeds seized in siddipet by task force police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Illegally Stored Fake Seeds Seized In Siddipet By Task Force Police

Siddipet Seeds: సిద్దిపేటలో అక్రమం నిల్వ చేసిన నకిలీ విత్తనాలు స్వాధీనం..

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 08:00 AM IST

Siddipet Seeds:సిద్దిపేట జిల్లాలో అక్రమంగా నిల్వఉంచిన 1450 కేజీల నకిలీ పత్తి విత్తనాలను adulterated seedsటాస్క్ ఫోర్స్ పోలీసులు task force స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేటలో స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలు
సిద్దిపేటలో స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలు

Siddipet Seeds: సిద్దిపేట జిల్లాలో ఒక ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, మరియు హుస్నాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.35 లక్షల విలువ గల 1450 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు హుస్నాబాద్Husnabad ఎస్ఐ మహేష్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మదాపూర్ గ్రామంలో ముక్కెర మల్లయ్య అనే ఇంటిలో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నాయని సమాచారం అందింది.

ఈ మేరకు శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ తో కలిసి అతని ఇంటిపై దాడులు నిర్వహించి ఎలాంటి ప్యాకింగ్ లేకుండా 29 సంచులలో నిల్వఉంచిన పత్తి విత్తనాలను పట్టుకున్నామని తెలిపారు . ఒక్కొక్క సంచిలో 50 కేజీల విత్తనాలు ఉంటాయని,మొత్తం 29 సంచులలో 1450 కేజీల విత్తనాలను పట్టుకొని పరిశీలించామని వారు తెలిపారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి ....

ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి కంపెనీ ప్యాకింగ్ లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి 50 కేజీల బ్యాగులల్లో పత్తి విత్తనాలను నిల్వచేశారు. దీంతో నకిలీ పత్తి విత్తనాలను, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హుస్నాబాద్ , కోహెడ, అక్కన్నపేట, మండలాలలోని గ్రామాల రైతులకు మరి ఇతర జిల్లాలలో రైతులకు అమ్మడానికి నిలువ చేసి ఉంచినట్లు తెలిపారు. హుస్నాబాద్ అగ్రికల్చర్ అధికారి ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ తెలిపారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నకిలీ విత్తనాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందులు, నకిలీ పురుగు మందులు అమ్మే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

తరచుగా విత్తనాల షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూస్తే షాపు యజమానులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తనాల, పురుగు మందుల విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని,వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు.

ఏ షాపులో విత్తనాలు కొన్న తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎక్కడైనా విడి విత్తనాలు, నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగుమందులో ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక తెలిపారు.

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న బాధితుడు …

సిద్దిపేట జిల్లాలో గుర్తుతెలియని బాధితుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని రూ. 24 లక్షలు పోగొట్టుకున్నాడు. నేరగాడు పంపిన ఇంస్టాగ్రామ్ లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ఉన్న పోస్టును చూసి అందులో జాయిన్ అయ్యాడు. దీంతో నేరగాడు బాధితుడికి ఒక లింకు పంపించి ట్రేడింగ్ లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మబలికారు.

బాధితుడు గత వారం కొన్ని డబ్బులు పెట్టగా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇదే అదనుగా భావించి సదరు బాధితుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఆశతో ఒకేసారి రూ. 24,80,500 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు.

ఆ తర్వాత డబ్బులు రావడం లేదని లింక్ ఓపెన్ చేసి చూడగా లింక్ బ్లాక్ చేసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన సదరు బాధితుడు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి సైబర్ నేరగాడి అకౌంట్లో ఉన్న రూ. 32,999 ఫ్రిజ్ చేశారు.

(ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)ht

IPL_Entry_Point