IIT Hyderabad Recruitment 2024 : ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
IIT Hyderabad Recruitment 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో నాన్ - టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 31 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో నాన్ - టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అక్టోబర్ 23 తేదీ నుంచే దరఖాస్తులు ప్రారంభం కాగా…డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 05.00 గంటలతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 31 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. పీఆర్వో ఒక పోస్టు ఉండగా... ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి. సూపరింటెండింగ్ ఇంజినీర్ - 1, టెక్నికల్ సూపరింటెండెంట్ - 1, స్టాఫ్ నర్స్ 05 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ పోస్టు ఒకటి ఉండగా... ఫిజియోథెరపిస్ట్ మరో పోస్టు ఉంది. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో రెండు ఖాళీలు ఉండగా... అకౌంటెంట్ పోస్టులు రెండు ఉన్నాయి.
పోస్టును అనుసరించి అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా.. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యూలర్ బేస్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
- పైపోస్టులకు అర్హులైన అభ్యర్థులు ముందుగా https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేయాలి.
- హోం పేజీలో క్విక్ లింక్స్ అనే అప్షన్ ఉంటుంది. దాని కింద కనిపించే Staff ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని కిందనే Apply here అప్షన్ ఉంటుంది.
- అప్లయ్ ఆప్షన్ పై నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
- అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఐఐటీ హైదరాబాద్ లో టీచింగ్ ఖాళీలు:
మరోవైపు ఐఐటీ హైదరాబాద్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన కూడా విడుదలైంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచే దరఖాస్తులు ప్రారంభం కాగా… నవంబర్ 1వ తేదీ సాయంత్రం 05.30 గంటలతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1, Assistant Professor గ్రేడ్ 2, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగంలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేయటంతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. ఏఐ, Electrical Engineering, బయోమెడికల్ ఇంజినీరింగ్, క్లైమెట్ ఛేంజ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సివిల్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,01,500 జీతం ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 98,200 జీతం చెల్లిస్తారు. ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ. 1,59,100గా జీతం ఉంది.
ఈ ఉద్యోగాల కోసం https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే faculty.recruitment@iith.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. లేదా 040-23016778 నెంబర్ ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం