IIT Hyderabad Jobs 2024 : ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు - భారీగా జీతం, ముఖ్యమైన వివరాలివే
IIT Hyderabad Recruitment 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 1వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
యసంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచే దరఖాస్తులు ప్రారంభం కాగా… నవంబర్ 1వ తేదీ సాయంత్రం 05.30 గంటలతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1, Assistant Professor గ్రేడ్ 2, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగంలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేయటంతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. ఏఐ, Electrical Engineering, బయోమెడికల్ ఇంజినీరింగ్, క్లైమెట్ ఛేంజ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సివిల్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,01,500 జీతం ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 98,200 జీతం చెల్లిస్తారు. ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ. 1,59,100గా జీతం ఉంది.
పోస్టును అనుసరించి అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వూలను నిర్వహించి… తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే faculty.recruitment@iith.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. లేదా 040-23016778 నెంబర్ ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు:
హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ(National Mineral Development Corporation) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 153 ఖాళీలు ఉన్నాయి.
మొత్తం 10 విభాగాల్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మైనింగ్ విభాగంలో 56 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 44 ఉద్యోగాలున్నాయి.
ఇక మెకానికల్ విభాగంలో 20 పోస్టులు ఉండగా,… కమర్షియల్ 4. సర్వే-9; కెమికల్- 4; సివిల్- 9; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఒక ఖాళీ ఉండగా… జియో అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మరో 3 జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
పోస్టులను అనుసరించి అర్హతలను పేర్కొన్నారు. https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తిస్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. ఆయా విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా పని అనుభవం కూడా ఉండాలి. మొదటగా ట్రైనీ పిరియడ్ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. 18 నెలలపాటు ట్రైనీ పిరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత.. పూర్తి పే స్కేల్ ను వర్తింపజేస్తారు. నెలకు జీతం రూ.37,000 నుంచి రూ.1,30,000గా ఉంటుందని నోటిఫికేషన్ లో వివరించారు.
నవంబర్ 10 చివరి తేదీ…
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. కేటగిరీలవారీగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇక Supervisory Skill Test కూడా ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా నియామక పత్రాలను అందజేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 10, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఆప్లికేషన్లను స్వీకరిస్తారు.
సంబంధిత కథనం