IICT Hyderabad Jobs 2024 : ఐఐసీటీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 31 ఖాళీలు, భారీగా జీతం..!
IICT Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. లక్షకు పైగా జీతం చెల్లిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఆర్గానికి కెమిస్ట్రీ, అగ్రో కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానికి కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్గానిక్ కోటింగ్, పాలిమర్స్, కెమికల్ బయాలజీతో పాటు డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ. 1,34,907 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో వివరించారు. అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు రుసుం కింద రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.iict.res.in/g4recruitment/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 09, 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించరు. నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును https://www.onlinesbi.sbi/sbicollec లింక్ పై క్లిక్ చేసి చెల్లించుకోవచ్చు.
HCU నుంచి ఉద్యోగ నోటిఫికేషన్:
టీచింగ్ పై ఆసక్తిగల వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 42 బ్యాక్ లాగ్ ఖాళీలు ఉండగా... అత్యధికంగా 21 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
నవంబర్ 8వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… డిసెంబర్ 9వ తేదీని గడువుగా నిర్ణయించారు.సైన్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. https://uohyd.ac.in/teaching-guest-faculty/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం