Govt Jobs 2024 : పోస్టుల భర్తీకి హైదరాబాద్ NIN ప్రకటన - టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, ముఖ్య తేదీలివే
ICMR NIN Hyderabad Recruitment2024:హైదరాబాదులోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.

ICMR NIN Vacancy 2024 Notification: హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ICMR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్- గ్రేడ్ 1తో పాటు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.మే 23వ తేదీ నుంచే అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా… జూన్ 16వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. రాత పరీక్ష జూలైలో ఉంటుంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్
- మొత్తం ఖాళీలు - 44
- ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్- 8, టెక్నీషియన్- గ్రేడ్ 1- 14 ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 1 - 22 ఉద్యోగాలు.
- అర్హత- పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో ఆ వివరాలను చూడొచ్చు.
- ఎంపిక విధానం - రాత పరీక్ష ఆధారంగా
- దరఖాస్తులు - ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ రుసుం - ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం -మే 23, 2024.
- దరఖాస్తు చివరి తేదీ- 16-జూన్-2024.
- రాత పరీక్ష- జులై 2024లో ఉంటుంది. తేదీలను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.nin.res.in/
- అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://icmrnin-recruitment.aptonline.in/
అగ్నివీర్ గా అప్లై చేసుకోండి….
IAF Agniveer Recruitment 2024: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) 01/2025 ఇన్ టేక్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) ఖాళీల భర్తీకి అవివాహిత భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 5( రాత్రి 11 గంటల వరకు) అగ్నివీర్ (Agniveer) అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూలై 3 నుంచి 12 వరకు కాన్పూర్, బెంగళూరుల్లో అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) ఖాళీల భర్తీకి రిక్రూట్ మెంట్ (Recruitment) టెస్ట్ నిర్వహిస్తారు. మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ లో ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ 1, 2, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ అపాయింట్ మెంట్స్ ఉంటాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
- ఈ అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు జనవరి 2, 2004 నుంచి జూలై 2, 2007 (రెండు రోజులు కలిపి) మధ్య జన్మించి ఉండాలి.
- విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి లేదా తత్సమాన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సంగీత సామర్థ్యం: అభ్యర్థులు టెంపో, పిచ్, ఒక పూర్తి పాట పాడటంలో కచ్చితత్వంతో పాటు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్టాఫ్ నోటేషన్/ తబలాచర్/ టానిక్ సోల్ఫా/ హిందుస్తానీ/ కర్ణాటక మొదలైన వాటిలో ఏదో ఒక సన్నాహక గీతాన్ని ప్రదర్శించగలగాలి. అభ్యర్థులు ట్యూనింగ్ అవసరమయ్యే వ్యక్తిగత వాయిద్యాలను ట్యూన్ చేయగలగాలి. స్వర వాయిద్యాలపై తెలియని గమనికలను సరిపోల్చగలగాలి.
టాపిక్