హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు, బారులు తీరిన నిరుద్యోగులు-hydra driver jobs 200 openings see huge unemployed turnout ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు, బారులు తీరిన నిరుద్యోగులు

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు, బారులు తీరిన నిరుద్యోగులు

హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయం ముందు నిరుద్యోగులు బారులు తీరారు. హైడ్రా 200 మంది డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు వందల సంఖ్యలో నిరుద్యోగులు క్యూ కట్టారు.

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు, బారులు తీరిన నిరుద్యోగులు

హైదరాబాద్ లో చెరువుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాలను కబ్జా కొరల్లో నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆక్రమణలను తొలగిస్తూ...హైడ్రా తరచూ వార్తల్లో నిలుస్తోంది.

200 డ్రైవర్ పోస్టులు

ఇటీవల హైడ్రాలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 200 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 19 నుంచి 21 వరకు డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి, తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగాలకు దూరమైన వారికి ప్రాధాన్యత ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదని తెలిపారు.

బారులు తీరిన నిరుద్యోగులు

ఈ ప్రకటనతో నిరుద్యోగులు హైడ్రా ఆఫీస్ ముందు బారులు తీరారు. హైడ్రా డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగానిరుద్యోగ యువత తరలివచ్చారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు.

హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీ వివరాలు

మొత్తం పోస్టులు - 200

అర్హతలు

  • గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల్లో ఫైనల్ రాత పరీక్ష రాసి, ఎంపిక కాని అభ్యర్థులకు ప్రాధాన్యత
  • డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం- మే 19
  • దరఖాస్తులకు ఆఖరి తేదీ -మే 21

సీఐఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​

సీఐఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. జూన్ 6, 2025 వరకు అప్లికేషన్​ దాఖలు చేయవచ్చు.

విద్యార్హతలు

పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు క్రీడలు, అథ్లెటిక్స్​లో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయస్సు- 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02/08/2002 కంటే ముందు- 01/08/2007 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

1.మొదటి దశ:

ఎ) ట్రయల్ టెస్ట్

బి) ప్రొఫిషియెన్సీ టెస్ట్

సి) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్​టీ)

డి) డాక్యుమెంటేషన్

2. రెండో దశ

మెడికల్ ఎగ్జామినేషన్

ట్రయల్ టెస్ట్:​ సెంటర్​లో అభ్యర్థులు రిపోర్ట్ చేసిన వెంటనే రిక్రూట్​మెంట్​ బోర్డు అడ్మిట్ కార్డులో ఉన్న ఫొటో, సంతకంతో పాటు ఫొటోతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా అభ్యర్థుల గుర్తింపును ధ్రువీకరిస్తుంది. ఐడీ అంటే.. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, యూనివర్శిటీ/కాలేజ్/స్కూల్ జారీ చేసిన ఐడీ కార్డు మొదలైనవి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం