HYDRA: స్పీడ్ పెంచిన హైడ్రా బుల్డోజర్లు.. రంగనాథ్ అస్సలు తగ్గడం లేదుగా!-hydra demolition in manemma colony ramnagar of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra: స్పీడ్ పెంచిన హైడ్రా బుల్డోజర్లు.. రంగనాథ్ అస్సలు తగ్గడం లేదుగా!

HYDRA: స్పీడ్ పెంచిన హైడ్రా బుల్డోజర్లు.. రంగనాథ్ అస్సలు తగ్గడం లేదుగా!

Basani Shiva Kumar HT Telugu
Aug 30, 2024 10:05 AM IST

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరింత దూకుడు పెంచారు. రెండ్రోజుల కిందట పరిశీలించిన రాంనగర్ మణెమ్మ కాలనీ ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ చేయించారు. దీంతో రంగనాథ్ తర్వాత ఎక్కడికి వెళ్లి పరిశీలిస్తారో అనే చర్చ జరుగుతోంది.

రాంనగర్ మణెమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు
రాంనగర్ మణెమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ నగరంలో హైడ్రా బుల్డోజర్లు స్పీడ్ పెంచాయి. తాజాగా.. రాంనగర్ ఏరియాలోని మణెమ్మ కాలనీలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని బల్దియా, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో.. ఇవాళ ఉదయమే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.

సీఎం రివ్యూ..

అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం అత్యవసర సమావేశం నిర్నహించారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పాల్గొన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్‌పై చర్చించారు. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించారు. వారు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే అంశం పైనా చర్చించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రూ.25 లక్షల ఎంపీ నిధులు..

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో ఎంపీ అనిల్‌కుమార్‌ గురువారం భేటీ అయ్యారు. హైడ్రా అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు అందజేశారు. హైదరాబాద్‌లో అనేక చెరువులను కబ్జా చేశారన్న ఎంపీ అనిల్.. ఎంత పొలిటికల్ ఒత్తిడి వచ్చినా.. భయపడే ప్రసక్తేలేదని రంగనాథ్ చెప్పారని వివరించారు.

చట్టబద్ధత కల్పించాల్సి ఉంది..

ప్రస్తుతం హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేషన్ లేదు. చట్టబద్ధత కూడా కల్పించాల్సి ఉంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నగరంలో తన పనిని మొదలుపెట్టిన హైడ్రా.. దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. మరికొందరికి నోటీసులను కూడా జారీ చేసింది.

జాబితా సిద్ధం..

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా హైడ్రా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం అక్రమణలకు పాల్పడిన వారు మాత్రమే కాకుండా.. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే.. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయటంతో.. శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.