Farm Lands Fraud: ఫార్మ్ ల్యాండ్స్ కొంటున్నారా?వాటి చట్టబద్దతపై హైడ్రా వార్నింగ్…
Farm Lands Fraud: తక్కువ ధరకు ఎక్కువ భూమి వస్తుందనే ఆశతో ముందు వెనుక ఆలోచించకుండా ఫార్మ్ ల్యాండ్స్ కొనుగోలు చేస్తే తిప్పలు తప్పవు. ఫార్మ్ ల్యాండ్స్ చట్టబద్దతపై హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు అనుమతులకు నిబంధనలు తెలియకుండా వాటిని కొనొద్దని హెచ్చరించారు.
Farm Lands Fraud: వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే అనేక సమస్యలు ఉంటాయని, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో నిబంధనలు, సమస్యలు తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టి విక్రయాలు జరుపుతున్నారని అలాంటి ఫ్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవీరంగనాథ్ హెచ్చరించారు.
ఫార్మ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ప్లాట్లకు అధికా రిక అనుమతులుండవని వాటిలో నిర్మాణాలను చేపట్టడానికి అనుమతులు ఇవ్వరని, ప్లాట్లు కొను గోలు చేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొ న్నారు. తెలంగాణ మునిసిపల్ యాక్ట్-2019, పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం వ్యవసాయ భూముల్లో ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు న్నాయని గుర్తు చేశారు. .
ఆ భూముల్లో ప్లాట్లు కొనొద్దు
ప్రభుత్వానికి ఫీజులు ఎగవేయడంతో పాటు, ప్రజలను మోసం చేసేలా పలు సంస్థలు ఫామ్ ల్యాండ్ పేరుతో విక్రయాలు జరుపుతున్నాయని రంగనాథ్ వివరించారు. అలాంటి స్థలాల కొనుగోళ్లపై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగ నాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు.
హైదరాబాద్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫార్మ్ ల్యాండ్స్ విక్రయాలపై ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ప్రజల్ని హెచ్చరించారు. రాజేంద్రనగర్ మండలం, లక్ష్మిగూడలోని 50వ సర్వే నంబరులోని ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్ ల్యాండ్ పేరుతో విక్రయించడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని లే అవుట్ వేసి అభివృద్ధి చేస్తే.. ప్రభుత్వానికి నిర్ణీత ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆది తప్పిం చుకునేందుకు కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని అలాంటి వాటిని కొనుగోలు చేయొద్దని హెచ్చరించారు. ఫార్మ్ ల్యాండ్స్ రూపంలో భూమి విక్రయాలు చేయాలంటే ఒక్కో ఫ్లాట్ కనీసం అర ఎకరా భూమి మేరకు ఉండాలన్నారు. నిర్ణీత పరిమాణంలో భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు.
అనుమతులు లేకుండా ఫార్మ్ ల్యాండ్ పేరుతో జరిగే విక్రయాలపై చర్యలు తప్పవని హెచ్చరనించారు. జీవో నంబరు 131 ప్రకారం 31.8.2020 తేదీ తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరు చేయడం లేదని అనుమతి లేకుండా కడితే కూల్చేస్తామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలో సర్వే న.50లో 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల రూపంలో లేఅవుట్ చేసి అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ స్పష్టతనిచ్చారు. 2 వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉంటేనే వ్యవసాయ భూమిగా పరిగణించాలంటూ గతంలో ప్రభు త్వం స్పష్టత ఇచ్చిందన్నారు. ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసిం దని గుర్తు చేశారు. జీవో 131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత అక్రమ లేవుట్లలోని ప్లాట్లలో అనుమతులు ఇచ్చేదిలేదని ప్రభు త్వం స్పష్టం చేసిందన్నారు.
ఫ్లాట్ల విక్రయాల్లో 10శాతం పార్కు లు, 30 శాతం రహదారుల కోసం స్థలాలు కేటాయించి లే అవుట్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నిషేధం ఉన్నా ఫార్మ్ ప్లాట్ల అమ్మకాలపై ఫిర్యాదులు వచ్చినందున ఇక నుంచి ఆ అంశంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
సంబంధిత కథనం