Hyderabadis In Pakistan : ఇరు దేశాల మధ్య వైరం ఉన్నా.. పౌరుల ఆత్మీయ ముచ్చట-hyderabadis warm welcome in pakistan ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabadis Warm Welcome In Pakistan

Hyderabadis In Pakistan : ఇరు దేశాల మధ్య వైరం ఉన్నా.. పౌరుల ఆత్మీయ ముచ్చట

పాకిస్థాన్ లో హైదరాబాదీలు
పాకిస్థాన్ లో హైదరాబాదీలు

పాకిస్థాన్ అనగానే ఏదో తెలియని భయం. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో.. ఇలాంటి ఆలోచనలు. అలానే పనిలో భాగంగా హైదరాబాదీలు అక్కడకు వెళ్లారు.

అసలే పాకిస్థాన్.. ఆ దేశం గురించి ఏదేదో విన్నాం. అక్కడకు వెళ్తే సేఫేనా? అందరూ ఏదేదో చెబుతుంటారు. తప్పకుండా వెళ్లాల్సిన పని.. వెళ్లకుంటే కుదరదు. ఇలాంటి ఆలోచనలో ఓ నలుగురు హైదరాబాద్(Hyderabad) నుంచి పాకిస్థాన్ బయలుదేరి వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్‌లో ఐటీఎఫ్ జే5 టోర్నమెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన శ్యాంసన్ కుమార్తె తానియా, సత్తెయ్య కుమార్తె ప్రిన్సీ కూడా టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనాల్సి ఉంది. పిల్లలను అక్కడ తీసుకెళ్లాలి. కానీ ఇంట్లో ఏదో భయం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటున్నాం. ఎన్నో భయాలు, ప్రశ్నలతో బయలుదేరారు. వెళ్తుంటే కూడా ఇండియన్స్ అని చెబితే ఏం అనుకుంటారోనని భయపడ్డారు. ఆపై ఇస్లామాబాద్ వెళ్లాలి. అక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జిన్నా స్టేడియంలో టోర్నమెంట్. అలా అనుకుంటూనే వెళ్లారు. నవంబర్ 10న ఆట పూర్తయింది.

ఇక స్డేడియ నుంచి తిరుగుపయనం.. చూస్తే క్యాబ్స్ లేవు. హోటల్ వెళ్లాలి. ఇప్పుడు ఎలా? అదే సమయంలో అటు నుంచి ఓ కారు వస్తుంది. లిఫ్ట్ అడిగారు హైదరాబాదీలు. అందులో ఉంది ఎవరో కాదు. తాహెర్ అనే యూట్యూబర్. లిఫ్ట్ ఇచ్చాడు. ఇక వెళ్తూ.. వెళ్తూ.. మాట్లాడుతుంటే.. వీళ్లు ఇండియన్స్ అని చెప్పారు. తాహెర్ అస్సలు వదిలిపెట్టలేదు. అతడికి కరాచీ, లాహోర్ లాంటి మెయిన్ ప్రాంతాల్లో హోటల్స్ కూడా ఉన్నాయి. దీంతో తినిపించే వరకూ విడిచిపెట్టలేదు. పాకిస్థాన్ లో హైదరాబాద్ బిర్యానీ(Hyderabad Biryani) తినిపించాడు. హైదరాబాదీలను ఎలా ఉందని అడిగాడు. మా హైదరాబాద్ బిర్యానీకి ఏదీ సాటిరాదని చెప్పారు. తాహెర్ కూడా.. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ కదా.. అందుకే అదే పేరు పెట్టి అమ్ముతున్నామని చెప్పాడు.

అయితే ఒక తాహెర్ మాత్రమే కాదు.. శ్యాంసన్, తానియా, సత్తెయ్య, ప్రిన్సీతో చాలామంది ఆప్యాయంగా మాట్లాడారని చెప్పారు. వచ్చేప్పుడు భయంతో వచ్చామని.. ఇక్కడకు వచ్చాక పరిస్థితులు వేరేలా ఉన్నాయని తాహెర్ తో వాళ్లు చెప్పిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వీడియో తాహెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఒక్క పాకిస్థాన్ లోనే కాదు.. ఇండియన్ కల్చర్ ను అభిమానించే వాళ్లు చాలా దేశాల్లో ఉన్నారు. ఇండియన్ అని చెప్పగానే.. దగ్గరకు తీసుకునేవాళ్లూ ఉన్నారు. ఇక భారతీయుల ఆతిథ్యం గురించి.. ప్రపంచానికి తెలిసిందే. ఇంట్లో వాళ్లలా చూసుకుంటారు. ప్రజలు.. ప్రజలు బాగానే ఉంటున్నారు.. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. పరిస్థితులే ప్రభావితం చేస్తాయని ఈ వీడియో చూసినవారు అంటున్నారు.

WhatsApp channel