YS Sharmila : 3800 కి.మీ పాదయాత్ర చేసిన తొలి మహిళగా వైఎస్ షర్మిల, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం-hyderabad ys sharmila 3800 km padayatra enters in india book of records ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Ys Sharmila 3800 Km Padayatra Enters In India Book Of Records

YS Sharmila : 3800 కి.మీ పాదయాత్ర చేసిన తొలి మహిళగా వైఎస్ షర్మిల, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

Bandaru Satyaprasad HT Telugu
Aug 15, 2023 02:52 PM IST

YS Sharmila : వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల ఈ ఘనత సాధించారు.

వైఎస్ షర్మిల పాదయాత్ర
వైఎస్ షర్మిల పాదయాత్ర

YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. సుదీర్ఘంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన తొలి మహిళగా వైఎస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు షర్మిలను కలిసి అవార్డును అందించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్ లో

తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టిన ప్రాంతం చేవెళ్ల నుంచి 2021 అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారు షర్మిల. దాదాపు ఏడాదిన్నర పాటు షర్మిల పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేవి. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల పాదయాత్రను అడ్డుకునేవారు. అయినప్పటికీ షర్మిల పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. షర్మిల నర్సంపేట పాదయాత్ర సమయంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. మధ్యలో కొన్ని రోజులు పాదయాత్ర ఆగిపోయినా, కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. తెలంగాణలో సుదీర్ఘంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినందుకు వైఎస్ షర్మిల పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది.

మొత్తం 4111 కిలోమీటర్ల పాదయాత్ర

2021 అక్టోబర్ 20న చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 3,800 కి.మీలు పూర్తి చేశారు. మార్చి 5 నాటికి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. మొత్తం 4,111 కిలోమీటర్లు పూర్తి చేయాలని షర్మిల భావించారు. కానీ పలు కారణాలతో ఆమె పాదయాత్రను మధ్యలోనే ముగించారు. ఈ 3,800 కిలోమీటర్ల పాదయాత్ర అపూర్వమైన రికార్డు అని, ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి, మొదటి మహిళ షర్మిల అని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు షర్మిలను కలిసి ఈ అరుదైన ఘనత సాధించినందుకు ప్రశంసించడంతో పాటు సర్టిఫికెట్‌ను అందజేశారు.

పాదయాత్ర రద్దు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో షర్మిలను ఫిబ్రవరి 19న మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు ముందస్తుగా కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. గిరిజన వర్గానికి చెందిన ఎమ్మెల్యేను అవమానించారని స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడి ఫిర్యాదు మేరకు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఎంను "తాలిబాన్" లాగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాన్ని "ఆఫ్ఘనిస్తాన్" అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నియంత, నిరంకుశుడు అని షర్మిల తరచూ విమర్శించేవారు. షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్యగా పేర్కొంటూ పోలీసులు షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు.

WhatsApp channel