US Gun Firing: అమెరికాలో తుపాకీ కాల్పులు, హైదరాబాద్‌ ఆర్కేపురం యువకుడి మృతి-hyderabad youth dies in gunfire in america ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Us Gun Firing: అమెరికాలో తుపాకీ కాల్పులు, హైదరాబాద్‌ ఆర్కేపురం యువకుడి మృతి

US Gun Firing: అమెరికాలో తుపాకీ కాల్పులు, హైదరాబాద్‌ ఆర్కేపురం యువకుడి మృతి

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 20, 2025 01:05 PM IST

US Gun Firing: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువకుడు దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే యువకుడు వాషింగ్టన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు విషాదంలో మునిగిపోయారు.

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్‌ యువకుడు రవితేజ
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్‌ యువకుడు రవితేజ

US Gun Firing: అమెరికాలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ యువకుడి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే ‍యువకుడు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. వాషింగ్టన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వాషింగ్టన్‌లో ఆదివారం రాత్రి రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు.

అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోవడం అతని కుటుంబాన్ని విషాదంలో నింపింది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. హైదరాబాద్ ఆర్కేపురంకు చెందిన. కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022లో అమెరికా వెళ్లాడు.

సోమవారం ఉదయం తుపాకీ కాల్పుల్లో రవితేజ గాయపడినట్టు బంధువులకు సమాచారం అందింది. తన కుమారుడి వద్ద నగదు కూడా లేదని, లీజుకు తీసుకున్న వాహనం కోసమే దుండగులు అతనిపై కాల్పులు జరిపి ఉంటారని మృతుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

రవితేజ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2022 మార్చిలో బిబిఏ పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్‌ చేయడానికి రవితేజ అమెరికా వెళ్లాడు. మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వాషింగ్టన్‌లో దోపిడీ ప్రయత్నంలో దుండగులు కాల్పులు జరపడంతో అతను మృతి చెందినట్టు అమెరికా పోలీసులు కుటుంబానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని మృతుని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం