Hyderabad Water Cut: హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17, 18న తాగునీటి సరఫరాలో అంతరాయం-hyderabad water cut prepare for supply interruption on july 17 and 18th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Water Cut: హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17, 18న తాగునీటి సరఫరాలో అంతరాయం

Hyderabad Water Cut: హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17, 18న తాగునీటి సరఫరాలో అంతరాయం

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 16, 2025 06:46 PM IST

Hyderabad Water Cut: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ సమయంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు.

హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17,18న నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17,18న నీటి సరఫరాలో అంతరాయం

Hyderabad Water Cut: హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతు పనులు చేయనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18.02.2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని జలమండలి అధికారులు తెలిపారు. కాబట్టి ఈ 24 గంటలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

మంచి నీటి సరఫరా అంతరాయం కలిగే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.

2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రినగర్, బాబా నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.

3. ఓ అండ్ ఎం డివిజన్-12 : చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.

4. ఓ అండ్ ఎం డివిజన్-13 : అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్ పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.

5. ఓ అండ్ ఎం డివిజన్-14 : చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.

6. ఓ అండ్ ఎం డివిజన్-15 : కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).

7. ఓ అండ్ ఎం డివిజన్-17 : హఫీజ్ పేట్, మియాపూర్.

8. ఓ అండ్ ఎం డివిజన్-21 : కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.

9. ఓ అండ్ ఎం డివిజన్-22 : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.

10. ట్రాన్స్ మిషన్ డివిజన్-4 : ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.

11. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు : ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్).

నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం