TGSRTC ITI College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు, దరఖాస్తులకు జూన్ 10 చివరి తేదీ!-hyderabad warangal tgsrtc iti college admissions 2024 applications invited ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Iti College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు, దరఖాస్తులకు జూన్ 10 చివరి తేదీ!

TGSRTC ITI College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు, దరఖాస్తులకు జూన్ 10 చివరి తేదీ!

TGSRTC ITI College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. హైదరాబాద్ , వరంగల్ లో ఆర్టీసీ ఐటీఐ కాలేజీ ఉన్నాయి. విద్యార్థులు జూన్ 10 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు, దరఖాస్తులకు జూన్ 10 చివరి తేదీ!

TGSRTC ITI College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్, వరంగల్ లోని టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు https://iti.telangana.gov.in ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రకటించారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివన్నారు.

కోరుకున్న డిపోల్లో అప్రెంటీషిప్

నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని సజ్జనార్ తెలిపారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ట్రేడ్‌లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిప్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ల పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సీట్ల వివరాలు

  • మోటార్ మెకానిక్ వెహికల్- 48 సీట్లు (2 Years)- 10వ తరగతి అర్హత
  • మెకానిక్ డీజిల్ -24 సీట్లు (1 Years)- 10వ తరగతి అర్హత
  • పెయింటర్ -20 సీట్లు (2 Years)- 8వ తరగతి అర్హత
  • వెల్డర్ - 40 సీట్లు (1 Years)- 8వ తరగతి అర్హత

తెలంగాణ ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు

తెలంగాణలో 2024-25 ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్‌ 10వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ఐటీఐ ప్రవేశాల ముఖ్య వివరాలు:

  • అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు.
  • ట్రేడ్ - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్
  • వయోపరిమితి - 14 ఏళ్లు నిండి ఉండాలి.
  • సీట్ల కేటాయింపు - అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో
  • దరఖాస్తులు రుసుం - రూ. 100 చెల్లించాలి.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 10 జూన్ , 2024.
  • ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://iti.telangana.gov.in/
  • దరఖాస్తు ఫారమ్ లింక్ - https://tsiti.ucanapply.com/

సంబంధిత కథనం