TSRTC Employees HRA : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, హెచ్ఆర్ఏ సవరిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన-hyderabad tsrtc announced hra revision according to new prc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Employees Hra : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, హెచ్ఆర్ఏ సవరిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన

TSRTC Employees HRA : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, హెచ్ఆర్ఏ సవరిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Mar 19, 2024 05:34 PM IST

TSRTC Employees HRA : ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పే స్కేల్ రివిజన్ కారణంగా హెచ్ఆర్ఏను సవరిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ హెచ్ఆర్ఏ సవరణ
టీఎస్ఆర్టీసీ హెచ్ఆర్ఏ సవరణ

TSRTC Employees HRA : టీఎస్ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల హెచ్ఆర్ఏ(HRA)ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలె ఆర్టీసీ ఉద్యోగులకు 21 ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించింది యాజమాన్యం. 2020లో జీవో నెం.53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. అయితే అప్పట్లో ఉద్యోగులకు పీఆర్సీ(PRC) ప్రకటించకపోవడం హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసీ వాయిదా వేసింది. ఇటీవల టీఎస్ఆర్టీసీ 2017 పేస్కేల్‌ రివిజన్‌(Pay scale Revision) చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో జీవో నంబర్ 53 ప్రకారం ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యంను సవరిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC)ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. 2017లో అప్పటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సిబ్బందికి 16 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ(PRC) ప్రకటించింది. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీపై ప్రకటన లేదు. ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల తెలిపారు. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నూతన పీఆర్సీ ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు(Pay Scale) అమలు చేయనున్నారు. ఈ పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ ఖజానాపై ఏటా 418.11 కోట్ల అదనపు భారం పడనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం