TS Tribal Welfare Schools : టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు, 38 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత-hyderabad ts tribal welfare residential schools got 97 26 pass percentage in ssc results 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tribal Welfare Schools : టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు, 38 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత

TS Tribal Welfare Schools : టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు, 38 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత

Bandaru Satyaprasad HT Telugu
Apr 30, 2024 08:18 PM IST

TS Tribal Welfare Schools : తెలంగాణ పది ఫలితాల్లో గిరిజన గురుల విద్యార్థులు ప్రతిభ చూపారు. 97.26 ఉత్తీర్ణత శాతంతో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.

సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు
సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు

TS Tribal Welfare Schools : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది పది పరీక్షల్లో 91.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఎస్ఎస్సీ ఫలితాల్లో(TS SSC Results) తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారు. గురుకుల విద్యాలయాలు సరాసరి 97.26 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ సంవత్సరం 33 మంది విద్యార్థులు 10 CGPA సాధించగా, 38 పాఠశాలలు నూటకి నూరు శాతం పాస్ పర్సెంటేజ్ సాధించాయి. గిరిజన ఆశ్రమ స్కూళ్లు టెన్త్ ఫలితాల్లో రికార్డులు సృష్టించాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 11.75 శాతం పెరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు 2024 ఫలితాల్లో 89.64 శాతం ఉత్తీర్ణత సాధించగా, గతేడాది ఫలితాల్లో 77.89 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల శ్రమే కారణం

గిరిజన గురుకుల పాఠశాలల(TS Gurukula Schools) ఉపాధ్యాయుల శ్రమ, విద్యార్థుల క్రమశిక్షణ, ప్రత్యేక తరగతులు నిర్వహణ, ప్రణాళికబద్దమైన స్టడీ వల్ల ఈ విజయం సాకారం చేసిందని అధికారులు అన్నారు. 100 శాతం ఉత్తీర్ణత దిశగా జనవరి నుంచే అడుగులు వేశామని, ఈ దిశగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి వారికి 2, 3 స్కూల్స్ దత్తత ఇచ్చామన్నారు. ఆ అధికారులు పాఠశాలలను సందర్శించి తగిన సలహాలు ఇచ్చారన్నారు. విద్యార్థులను 5 గ్రూపులుగా విభజంచి, వారిని ప్రోత్సహించామన్నారు. ఉదయం , రాత్రి సమయాల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేశామన్నారు. దీంతో విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ చాటారని గిరిజన గురుకుల స్కూళ్ల అధికారులు అన్నారు.

జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి(TS SSC) సప్లమెంటరీ పరీక్షల్ని(TS Supplementary Exams 2024) జూన్ 3 నుంచి జూన్‌ 13వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షల్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు గడువు తక్కువగా ఉన్నందున 2024 మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ కౌంటింగ్(Recounting), రీ వెరిఫికేషన్‌(Reverification) పలితాలతో సంబంధం లేకుండా జూన్‌లో జరిగే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ పదో తరగతి పరీక్షల రీకౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోగా మే15వ తేదీలోగా ఎస్‌బీఐ బ్యాంకులో హెడ్‌ఆఫ్‌ అకౌంట్‌ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 0202 ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ అండ్ కల్చర్, 01 జనరల్ ఎడ్యుకేషన్, 102 సెకండరీ ఎడ్యుకేషన్, 06 డైరెక్టర్ ఆఫ్‌ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌, 800 యూజర్‌ ఛార్జెస్‌ హెడ్ అకౌంట్లకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం