TS TET Key Response Sheets : తెలంగాణ టెట్ కీ, రెస్పాన్స్ షీట్స్ విడుదల- జూన్ 12న ఫలితాలు-hyderabad ts tet 2024 key response sheets released results on june 12th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet Key Response Sheets : తెలంగాణ టెట్ కీ, రెస్పాన్స్ షీట్స్ విడుదల- జూన్ 12న ఫలితాలు

TS TET Key Response Sheets : తెలంగాణ టెట్ కీ, రెస్పాన్స్ షీట్స్ విడుదల- జూన్ 12న ఫలితాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 03, 2024 08:52 PM IST

TS TET Key Response Sheets : తెలంగాణ టెట్ కీ విడుదల అయ్యింది. నిన్నటితో టెట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇవాళ పేపర్ల వారీగా టెట్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు.

తెలంగాణ టెట్ కీ విడుదల, జూన్ 12న ఫలితాలు
తెలంగాణ టెట్ కీ విడుదల, జూన్ 12న ఫలితాలు

TS TET Key Response Sheets : తెలంగాణ టెట్ కీ విడుదల అయ్యింది. నిన్నటితో టెట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇవాళ పేపర్ల వారీగా టెట్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుద చేశారు. జూన్ 12న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అభ్యర్థులు టెట్ కీ, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/ లో చెక్ చేసుకోవచ్చు.

కీ పై అభ్యంతరాలు ఉంటే

తెలంగాణ టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగాయి. టెట్‌ పేపర్‌-1కు 99,958 మంది, పేపర్‌-2కు 1,86,423 మంది అప్లై చేసుకోగా... పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. నిన్నటితో టెట్ పరీక్షలు ముగిశాయి. దీంతో ఇవాళ టెట్ ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్స్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్ల వారీగా కీని అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. టెట్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు.

తెలంగాణ టెట్‌ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీకి ముందు టెట్ పరీక్షను నిర్వహిస్తుంటారు. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు టెట్‌లో అర్హత తప్పనిసరి.

తెలంగాణ రెస్పాన్ షీట్లు ఇలా చెక్ చేసుకోండి?

  • Step 1 : అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 2 :హోం పేజీలోని రెస్పాన్ షీట్లు లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 3 :తర్వాత పేజీలో జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, ఎగ్జామ్ పేపర్( Paper 1 or Paper 2) వివరాలు నమోదు చేయాలి.
  • Step 4 : ఆ తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే అభ్యర్థి రెస్పాన్స్ షీట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.

అభ్యంతరాలు ఇలా తెలపవచ్చు

టెట్ ప్రిలిమినరీ కీ పై అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు టెట్ వెబ్ సైట్ లో అబ్జెక్షన్ విండో https://tstet2024.aptonline.in/tstet/Objections ఓపెన్ చేశారు. అభ్యర్థి జర్నల్ నెంబర్, టెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదు చేసి కీ పై అభ్యంతరాలు తెలపవచ్చు.

డీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం