Paramedical EWS Quota : పారామెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా, తెలంగాణ సర్కార్ ఆదేశాలు-hyderabad ts govt ordered ews quota reservation to paramedical courses admissions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Ts Govt Ordered Ews Quota Reservation To Paramedical Courses Admissions

Paramedical EWS Quota : పారామెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా, తెలంగాణ సర్కార్ ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 29, 2023 06:58 PM IST

Paramedical EWS Quota : పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పారామెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కోటా
పారామెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కోటా

Paramedical EWS Quota : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారా మెడికల్‌ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాను వర్తింపజేయాలని నిర్ణయించింది. అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఈ కోటా ద్వారా 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ(నర్సింగ్‌), పీబీబీఎస్‌సీ(నర్సింగ్‌) పారామెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel