TS ECET 2024 : తెలంగాణ ఈసెట్(TS ECET 2024) దరఖాస్తు ప్రక్రియ నేటితో(April 16) ముగియనుంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అభ్యర్థులు https://ecet.tsche.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకునేందుకు ఇవాళ చివరి తేదీ కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి అప్లికేషన్ సవరణ విండో ఓపెన్ చేయనున్నారు. ఇది ఏప్రిల్ 28తో ముగుస్తుంది. టీఎస్ ఈసెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 1 నుంచి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 6, 2024న(TS ECET 2024 Date) నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిఫ్టులో ఈసెట్ నిర్వహిస్తారు.
టీఎస్ ఈసెట్ రిజిస్ట్రేషన్ (TS ECET Registration)ఫీజు SC/ST, PH అభ్యర్థులకు రూ. 500 కాగా, ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ. 900. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ రుసుమును TS ఆన్‌లైన్ కేంద్రాలలో, AP ఆన్‌లైన్ కేంద్రాలలో లేదా క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. టీఎస్ ఈసెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
తెలంగాణ లా సెట్(TS LAWCET), పీజీఎల్ సెట్(TS PGLCET)-2024 దరఖాస్తు గడువును మరో పది రోజులు పొడిగించారు. అంటే ఏప్రిల్ 25 వరకు అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. లా సెట్ మార్చి 1న అప్లికేషన్లు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్-2024 పరీక్షను జూన్ 3 నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఉంటుంది.
తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS LAWCET 2024), తెలంగాణ స్టేట్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS PGLCET 2024) కోసం దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tsche.ac.in/# ను సందర్శించండి. 2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.
సంబంధిత కథనం