TS EAPCET 2024 Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
TS EAPCET 2024 Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
TS EAPCET 2024 Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్(TS EAPCET 2024) ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు(TS EAPCET Hall Tickets) విడుదలయ్యాయి. సోమవారం అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ హాల్ టికెట్లు విడుదల కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంజినీరింగ్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు eapcet.tsche.ac.in వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మే 7 నుంచి ఈఏపీసెట్ పరీక్షలు
తెలంగాణ ఈఏపీసెట్(TS EAPCET 2024) అగ్రికల్చర్, ఫార్శసీ హాల్ టికెట్లు(Hall Tickets) సోమవారం విడుదలయ్యాయి. ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థుల హాల్ టికెట్లను ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS EAPCET- 2024) నిర్వహిస్తోంది. ఈ ఈ పరీక్షకు హాల్ టిక్కెట్లు(TS EAPCET Hall Tickets) లేదా అడ్మిట్ కార్డులను నిన్న విడుదల చేసింది. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ నుంచి అడ్మిట్ కార్డులను(Admit Cards) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీసెట్ కు లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ అభ్యర్థులు రూ. 5,000 ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 9, 10 , 11 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జెఎన్టీయూ(JNTU Hyderabad), హైదరాబాద్ నిర్వహిస్తుంది. 2024-2025 విద్యాసంవత్సరానికి తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈఏపీసెట్ 2024 నిర్వహిస్తారు.
ఈఏపీసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ ఎలా?(TS EAPCET 2024 Hall Tickets Download)
Step 1 : కౌన్సిల్ వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ ను సందర్శించండి
Step 2 : EAPCET 2024 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3 : అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెం, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెం, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేశాలి.
Step 4 : Get Hall Ticket ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్(Engneering Stream) కు 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్ కన్వీనర్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం