Traffic Diversions : జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్నారా? మీ కోసమే ఈ విషయం-hyderabad traffic diversions around jubilee hills check post here s route map ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Traffic Diversions Around Jubilee Hills Check Post Here's Route Map

Traffic Diversions : జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్నారా? మీ కోసమే ఈ విషయం

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 06:36 PM IST

Hyderabad Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చాలామందికి తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్ సైడ్ వెళితే.. చాలాసేపు ట్రాఫిక్ లోనే వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

భాగ్యనగరంలో(Hyderabad) చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్(Traffic) సమస్య ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లైతే గంటలపాటు ఉండాల్సి వస్తుంది. జూబ్లీచెక్ పోస్ట్(Jubilee Check Post) వైపు వెళితే.. ఇదే సమస్య. అక్కడ నుంచి రోడ్ నెంబర్ 45(Road Number 45) మధ్య ట్రాఫిక్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మెల్లమెల్లగా ట్రాఫిక్ కదులుతుంటే.. ఇంకా ఎంతసేపు అని విసుగువస్తుంది. ఇందుకోసమే ట్రాఫిక్ అధికారులు ఓ ప్లాన్ వేశారు. ఎక్కువ మెుత్తంలో ట్రాఫిక్ డైవెర్షన్లు(Traffic Diversions) పెడుతున్నారు. వాహనాలు త్వరగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక వారంపాటు ఈ ప్లాన్ అమలు చేస్తారు. సక్సెస్ అయితే.. కంటిన్యూ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

జూబ్లీహిల్స్ నుంచి దుర్గం చెరువు(Durgam Cheruvu) మార్గంలో వెళ్లేవారికి ఈ ట్రాఫిక్ డైవెర్షన్‌(Traffic Diversions)లు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన మ్యాప్(Map) కూడా విడుదలైంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి(Durgam Cheruvu Cable Bridge) వైపునకు వెళ్లే వాహనదారులు ఆ జంక్షన్ నుంచి రోడ్ నెంబరు 36 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1650.. Cream Stone తర్వాత లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబరు 54 మీదుగా రోడ్ నెంబరు 45కి కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కిందికి వెళ్తారు. ఇక అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి కేబుల్ బ్రిడ్జిపై(Cable Bridge)కి వెళ్లొచ్చు.

క్రోమా తర్వాత ఎడమ వైపునకు తిరిగి జూబ్లీహిల్స్(jubilee hills) రోడ్ నెంబర్ 39 మీదుగా మంగోలియా బేకరీ దగ్గర రోడ్ నెంబరు 45కి చేరుకోవాలి. జోజోజ్ పిజ్జేరియా రెస్టారెంట్ దగ్గర యూటర్న్ తీసుకొని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి(cable Bridge) మార్గంలోకి వెళ్ళాలి. ప్రస్తుతం.. వెహికల్స్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్(jubilee hills.. లెఫ్ట్ టర్న్.. రోడ్ నెంబర్ 45 జంక్షన్.. రైట్ టర్న్ గా ఉంది. ఇకపై ఇక్కడ రైట్ టర్న్ ను మూసేస్తారు. జర్నలిస్ట్ కాలనీ(Journalist Colony) జంక్షన్ వద్ద కూడా రైట్ టర్న్ అనుమతి ఉండదు. కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద నుంచి లేదా ఇనార్బిట్ మాల్(Inorbit Mall) వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో వాహనదారులను రోడ్ నెంబరు 45 జంక్షన్ సైడ్ అనుమతి ఉండదు. రోడ్ నెంబరు 54 దగ్గరలో ఎడమవైపు తీసుకొని రోడ్ నెంబర్ 36పై మెట్రో పిల్లర్(Metro Pillar) నెంబర్ 1663 వద్ద యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్ నెంబర్ 36పై జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లొచ్చు.

మరోవైపు కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చేవారు BNR హిల్స్, ఖాజాగూడ లేదా ఫిల్మ్ నగర్(Film Nagar) జంక్షన్ వెళ్లేవారు హార్ట్ కప్ దగ్గర యూటర్న్(U Turn) తీసుకొవాలి. గీతా ఆర్ట్స్(Geetha Arts) ఆఫీసు/బ్రాడ్ వే వైపు రావాల్సి ఉంటుంది. రోడ్ నెంబర్ 51లోకి వెళ్లి పక్షి సర్కిల్ నుంచి న్యాయ విహార్, అనంతరం ఎడమవైపు తీసుకొని బాటా మీదుగా ఫిల్మ్ నగర్ జంక్షన్(Film Nagar Junction) వెళ్లొచ్చు.

ఇంకోవైపు బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నెంబరు 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చేవాళ్లు.. ఒడిశా ఐలాండ్/కళింగ భవన్/అగ్రసేన్ జంక్షన్ వద్ద కుడివైపు తీసుకోవాలి. క్యాన్సర్ హాస్పిటల్(Cancer Hospital), కేబీఆర్ పార్క్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవాలి. ఫిల్మ్ నగర్/సీవీఆర్ జంక్షన్ నుంచి వచ్చేవారు.. రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని హార్ట్ కప్ వరకూ వెళ్లి కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్(Cable Brige Fly Over) కింద యూటర్న్ తీసుకొవాలి. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ రావాలి అనుకుంటే.. ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా రావడం కుదరదు. ఫిల్మ్ నగర్ జంక్షన్(Film Nagar) వద్ద ఎడమవైపు తీసుకోవాలి. భారతీయ విద్యాభవన్(Vidya Bhavan) వద్ద యూటర్న్ తీసుకొవాలి. సీవీఆర్ జంక్షన్(CVR Junction) మీదుగా జర్నలిస్టు కాలనీ, రోడ్డు నెంబరు 45 జంక్షన్ వెళ్లాలి. ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్/ఓమేగా హాస్పిటల్ వైపు వెళ్లేవారు సీవీఆర్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకోవాలి. జర్నలిస్ట్ కాలనీ(Journalist Colony) వద్ద యూటర్న్, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి నేరుగా రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లొచ్చు. ఈ డైవెర్షన్ తో ట్రాఫిక్(Traffic) అంతరాయం తగ్గితే ఇదే కంటిన్యూ చేయనున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ మళ్లింపు
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్