IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!-hyderabad to sri lanka ramayana yatra irctc 5 days air tour package full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 01:40 PM IST

IRCTC Srilanka Tour Package : ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి శ్రీలంక ఎయిర్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. 5 రోజుల పాటు శ్రీలంకలోని పర్యటన ప్రదేశాలు చూడవచ్చు.

హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర
హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర

IRCTC Srilanka Tour Package : ఈ సమ్మర్ ఫ్యామిలీతో ట్రిప్(Summer Trip) ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ(IRCTC Srilanka Tour) శ్రీలంక ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర(Srilanka Ramayana Yatra), శంకరీ దేవి శక్తి పీఠం 5 రోజు టూర్ ప్యాకేజీ(Tour Package) అందుబాటులో ఉంచింది. రూ.49,930 ప్రారంభ ధరతో 5 రోజుల పాటు కొలంబో(Colombo), దంబుల్లా, కాండీ, నువరేలియా ప్రాంతాలను సందర్శించవచ్చు. జూన్ 1న ఈ టూర్ ప్రారంభం కానుంది.

ప్యాకేజీ ధర(Package Details) :

సింగిల్ షేరింగ్డబుల్ షేరింగ్ట్రిపుల్ షేరింగ్చైల్డ్ విత్ బెడ్చైల్డ్ విత్ అవుట్ బెడ్
రూ.62660రూ.51500రూ.49930రూ.39440రూ.37430

పర్యటన వివరాలు : కొలంబో, దంబుల్లా, కాండీ, నువరేలియా (04 రాత్రులు / 05 రోజులు)

  • డే 01 : హైదరాబాద్-కొలంబో-దంబుల్లా : ఉదయం 06:30 గంటలకు హైదరాబాద్(Hyderabad Airport) అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి విమానంలో బయలుదేరి 12:10 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు వెళ్తారు. మార్గమధ్యలో చిలావ్‌లోని మునీశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మనవేరి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత దంబుల్లా(Dambulla)కు చేరుకుంటారు. దంబుల్లాలో హోటల్ దిగి, రాత్రి బస చేస్తారు.
  • డే 02 : దంబుల్లా-కాండీ : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చెక్-అవుట్ చేసి, ఉదయం 07 గంటలకు ట్రింకోమలీకి వెళ్లి తిరుకోణేశ్వర్, లక్ష్మీ నారాయణ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కాండీకి వెళ్తారు. కాండీ నగర పర్యటన ఉంటుంది. కాండీ విలువైన రాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీలంక(Srilanka)లోని అతిపెద్ద హిల్ స్టేషన్ల(Hill Station)లో ఒకటి. జెమ్స్ ఫ్యాక్టరీ / బాటిక్ ఫ్యాక్టరీని ఇక్కడ చూడవచ్చు. టూత్ టెంపుల్ (గౌతమ బుద్ధుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం) సందర్శించవచ్చు. రాత్రికి కాండీలో బస చేస్తారు.
  • డే 03 : కాండీ-నువారెలియా-కాండీ : బ్రేక్ ఫాస్ట్ తర్వాత నువారెలియా టూర్ ఉంటుంది. మార్గంలో రాంబోడాలోని భక్త హనుమాన్ ఆలయాన్ని సందర్శించవచ్చు. సీత అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక సందర్శించి ఆ తర్వాత తిరిగి కాండీకి చేరుకుంటారు. కాండీ(Kandy) హోటల్ రాత్రి బస ఉంటుంది.
  • డే 04 : కాండీ-నెగోంబో : బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని సందర్శిస్తారు. తర్వాత కొలంబో పయమవుతారు. మార్గంలో మధ్యాహ్న భోజనం చేసి, పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయాన్ని సందర్శిస్తారు. క్లాక్ టవర్, గాల్ ఫేస్, కొలంబో హార్బర్, బైరా లేక్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మ్యూజియం, నేలమ్ పోకునా థియేటర్, టౌన్ హాల్‌తో సహా లైట్‌హౌస్‌, కొలంబో నగర పర్యటనకు వెళ్తారు. సాయంత్రం కొలంబోలో(Colombo) షాపింగ్ చేయవచ్చు. అక్కడి నుంచి హోటల్‌కి వెళ్తారు. రాత్రికి నెగొంబోలో బస చేస్తారు.
  • డే 05 : నెగోంబో-ఎయిర్‌పోర్ట్-హైదరాబాద్ : తిరిగి హైదరాబాద్(Hyderabad) ప్రయాణం కోసం 04:00 AMకి విమానాశ్రయానికి తీసుకెళ్తారు. ఉదయం 07:25 గంటలకు UL 177 విమానం బయలుదేరి 09:20 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

హైదరాబాద్ -శ్రీలంక టూర్ పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విమాన వివరాలు:

తేదీఫ్లైట్ నెంబర్నుంచిTimeToTime
01-06-2024UL178హైదరాబాద్10.15కొలంబో12.10
05-06-2024UL177కొలంబో7.25హైదరాబాద్09.20

భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీ నుంచి కనీసం 06 నెలల పాటు పాస్ పోర్టు(Passport) చెల్లుబాటు అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం