Hyderabad Ooty Tour : హైదరాబాద్-ఊటీ సమ్మర్ ట్రిప్, నీలగిరి పర్వతాల్లో చక్కర్లు, నైట్ స్టే
Hyderabad Ooty Tour : సమ్మర్ లో ఫ్యామిలీతో ఊటీ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ బెస్ట్ ప్యాకేజీ అందిస్తుంది. కేవలం రూ.11,450 వేలకు 6 రోజులు నీలగిరి పర్వతాలు, ఊటీలో సుందరమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేయవచ్చు.
Hyderabad Ooty Tour : సమ్మర్ లో కూల్ గా ఊటీ ట్రిప్ ప్లాన్(IRCTC Ooty Tour) చేస్తున్నారా? కుటుంబంతో ఊటీ చుట్టేసేందుకు ఐఆర్సీటీసీ(IRCTC) హైదరాబాద్ నుంచి ఊటీ(Hyderabad to Ooty Tour Package) ప్యాకేజీ ప్రకటించింది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు పాటు టూర్ ఉంటుంది. ఊటీ హిల్ స్టేషన్ల క్వీన్ అంటారు. నీలగిరి జిల్లా రాజధాని ఊటీ. సౌత్ ఇండియాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఊటీ ఒకటి. ఊటీ సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంది. నీలగిరి పర్వతాల్లో రైలు ప్రయాణం పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఊటీ ఉంది.
హైదరాబాద్ - ఊటీ ప్యాకేజీ ధర(Hyderabad Ooty Package) - (ఏప్రిల్ 2024 నుంచి)
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ (1 నుంచి 3 మంది ప్రయాణికులు)
కేటగిరి | సింగిల్ షేరింగ్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్ | చైల్డ్ విత్ అవుట్ బెడ్ |
కంఫర్ట్(3A) | రూ.33020 | రూ.18480 | రూ.14870 | రూ.9430 | రూ.9180 |
స్టాండర్ట్(SL) | రూ.30560 | రూ.16020 | రూ.12410 | రూ.6970 | రూ.6730 |
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (4 నుంచి 6 మంది ప్రయాణికులు)
కేటగిరి | ట్విన్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్ | చైల్డ్ విత్ అవుట్ బెడ్ |
కంఫర్ట్(3A) | రూ.16930 | రూ.14580 | రూ.9430 | రూ.9180 |
స్టాండర్ట్(SL) | రూ.14470 | రూ.12120 | రూ.6970 | రూ.6730 |
- టూర్ ట్రావెల్ : హైదరాబాద్ - ఊటీ - కానూర్ - హైదరాబాద్ (05 రాత్రులు / 06 రోజులు)
డే-01(మంగళవారం)
రైల్ నెం.17230- శబరి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గం.12:20 లకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ.
డే-02(బుధవారం)
కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు దాదాపు గం.08:02 చేరుకుంటుంది. అక్కడ నుంచి 90 కి.మీ ప్రయాణించి ఊటీలో హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు సందర్శించండి. రాత్రిపూట ఊటీలో బస చేస్తారు.
డే-03(గురువారం)
హోటల్‌లో టిఫెన్ చేసిన తర్వాత దొడబెట్ట హిల్, టీ మ్యూజియం, పైకారా జలపాతం టూర్ ఉంటుంది. రాత్రిపూట ఊటీలో బస చేస్తారు.
డే- 04(శుక్రవారం)
హోటల్‌లో అల్పాహారం తర్వాత కొన్నూర్ సందర్శనా స్థలాలను టూర్ ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు.రాత్రిపూట ఊటీలో బస ఉంటుంది.
డే- 05(శనివారం)
హోటల్‌లో అల్పాహారం తర్వాత మధ్యాహ్నానికి చెక్ అవుట్ చేయాలి. అక్కడి నుంచి కోయంబత్తూరుకు చేరుకుంటారు. కోయంబత్తూరు టౌన్ రైల్వే స్టేషన్‌లో 16:35 గంటలకు రైలు నెం. 17229 శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాలి.
డే- 06(ఆదివారం)
అర్ధరాత్రి 12:20 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మొత్తం సీట్ల కోటా: స్లీపర్ నాన్ ఏసీ-12, 3 ఏసీ- 06