IRCTC Hyd to Andaman : హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే-hyderabad to andaman islands irctc air tour package available tour details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd To Andaman : హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే

IRCTC Hyd to Andaman : హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2024 01:35 PM IST

IRCTC Hyd to Andaman Package : హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. 6 రోజుల పాటు అండమాన్ , నికోబార్ దీవుల్లో పర్యటించవచ్చు.

హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే
హైదరాబాద్ నుంచి అండమాన్ ఎయిర్ టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే

IRCTC Hyd to Andaman Package : ఐఆర్సీటీసీ టూరిజం అండమాన్ దీవులకు కొత్త టూర్ ప్యాకేజీ అందిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అండమాన్, నికోబార్ దీవుల ఇసుక బీచ్‌లను ఎక్స్ ప్లోర్ చేసేందుకు ఆరు రోజుల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి వచ్చింది. ఈ టూర్ లో మీరు పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ చూడొచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ఒక్కొక్కరికి రూ53,560. తదుపరి టూర్ అక్టోబర్ 18, 2024.

అండమాన్ దీవులు బంగాళాఖాతంలో ఉన్న భారతీయ ద్వీపసమూహం. ఈ దాదాపు 300 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల్లో తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు ప్రసిద్ధి. సముద్ర జీవులకు ఆవాసలైన కోరల్ రీఫ్స్ లో డైవింగ్, స్నార్కెలింగ్ చేయవచ్చు.

విమాన పర్యటన వివరాలు:

స్టార్టింగ్గమ్యస్థానంఫ్లైట్ నెం.బయలుదేరు సమయంచేరుకునే సమయం
హైదరాబాద్పోర్ట్ బ్లెయిర్6E-630506:3009:15
పోర్ట్ బ్లెయిర్హైదరాబాద్6E-630609:5512:10

ప్యాకేజీ టారిఫ్ (వ్యక్తికి):

క్లాస్   సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు)చైల్డ్ విత్ బెడ్ (2-11 సంవత్సరాలు)
కంఫర్ట్రూ. 71810/-రూ. 55200/-రూ. 53560/-రూ. 46600/-రూ. 43200/-

చిన్నపిల్లలు (2 సంవత్సరాల లోపు) రూ. 1500 నేరుగా విమానాశ్రయ కౌంటర్లలో చెల్లించాలి.

టూర్ ఇలా : హైదరాబాద్-పోర్ట్ బ్లెయిర్-హేవ్‌లాక్ ఐలాండ్-నీల్ ఐలాండ్- పోర్ట్ బ్లెయిర్-హైదరాబాద్

1వ రోజు :- హైదరాబాద్-పోర్ట్ బ్లెయిర్

మొదటి రోజు ఉదయం 04:35కి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలి. ఉదయం 06:35కి విమానం బయలుదేరి 09:15కి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ స్థానిక ప్రతినిధి పర్యాటకులను హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి, లంచ్ తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియంను సందర్శిస్తారు. తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్, ఆపై సెల్యులార్ జైలులో లైట్ & సౌండ్ షో వీక్షిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి బస చేస్తారు.

2వ రోజు :- రాస్ & నార్త్ బే ఐలాండ్ టూర్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత రాస్ ద్వీపానికి వెళ్తారు. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత తర్వాత నార్త్ బే ఐలాండ్‌ని సందర్శిస్తారు. వివిధ వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ఆస్వాదిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం పోర్ట్ బ్లెయిర్‌కు తిరిగి వెళ్తారు. అనంతరం మెరైన్ మ్యూజియమ్‌ సందర్శన, సాయంత్రం షాపింగ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోని సంబంధిత హోటల్‌లో రాత్రి బస చేస్తారు.

3వ రోజు :- పోర్ట్ బ్లెయిర్ - హేవ్‌లాక్ ద్వీపం

హేవ్ లాక్ ఐలాండ్ కు వెళ్లేందుకు హోటల్ లో చెక్ అవుట్ చేస్తారు. హేవ్‌లాక్ వద్దకు చేరుకున్నప్పుడు హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. భోజనం తర్వాత రాధానగర్ బీచ్‌ని సందర్శిస్తారు. హావ్‌లాక్‌లో డిన్నర్ నైట్ స్టే ఉంటుంది.

4వ రోజు :- హావ్‌లాక్ ద్వీపం - నీల్ ద్వీపం

అల్పాహారం తర్వాత కాలా పత్తర్ బీచ్‌కి వెళ్తారు. ఆ తర్వాత క్రూయిజ్ టైమింగ్ ప్రకారం నీల్ ఐలాండ్‌కు వెళ్తారు. సాయంత్రం సూర్యాస్తమయం ఎంజాయ్ చేసేందుకు సీతాపూర్ బీచ్, లక్ష్మణపూర్ బీచ్‌లను సందర్శించండి. రాత్రికి స్థానికంగా బస చేస్తారు.

5వ రోజు:- నీల్ ఐలాండ్ - పోర్ట్ బ్లెయిర్

బ్రేక్ ఫాస్ట్ చెక్ అవుట్ తర్వాత భరత్‌నగర్ బీచ్‌ని సందర్శిస్తారు. స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, నైట్ స్టే ఉంటుంది.

6వ రోజు: పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్ కు

ఉదయాన్నే హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి 07:55 కి విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. ఉదయం 09:55కి విమానం ఎక్కుతారు. మధ్యాహ్నం 12:10కి హైదరాబాద్ చేరుకుంటారు.

హైదరాబాద్ నుంచి అండమాన్ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుకింగ్, ఇతర వివరాలు కింద లింక్ లో పొందవచ్చు.

సంబంధిత కథనం