TGPSC Hostel Welfare Jobs : టీజీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు తేదీలు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన చేశారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు 3 రోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్‌మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో నిర్వహించనున్నారు.
అభ్యర్థులు మూడు రోజుల ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.in లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు హాల్‌టికెట్‌పై ముద్రించారు. అభ్యర్థులు ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను హాల్ టికెట్ పై అతికించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో అధికారుల సమక్షంలో హాల్ టికెట్‌పై సంతకం చేయాలి. పరీక్ష కేంద్రం/పరీక్ష హాల్‌లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్‌ను తప్పనిసరిగా చూపించాలి. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు అంటే, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రూప్ కోసం తీసుకురావాలి.
సంబంధిత కథనం