TG IPS Transfers : తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లు బదిలీ, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియామకం
TG IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణ లా అండ్ ఆర్డర్ ఏడీజీగా మహేష్ భగవత్ ను నియమించింది.
TG IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ ల అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్
- హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా
- టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్
- గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర
- రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు
- ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి
- మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
- రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు
- మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ
- హైదరాబాద్ సీఆర్ హెడ్ క్వా్ర్టర్ డీసీపీగా రక్షిత మూర్తి
- మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి
- వనపర్తి ఎస్పీగా గిరిధర్
- ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్
తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను… హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
కొత్త డీజీపీ ప్రస్థానమిదే…
పంజాబ్‌కు చెందిన జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డిఐజిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్‌లలోనూ జితేందర్ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు ట్రాఫిక్ కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 2025 సెప్టెంబరులో పదవీ విరమణ చేస్తారు. తాజా నియామకంతో 14 నెలలపాటు డీజీపీగా కొనసాగుతారు.
సంబంధిత కథనం