TS Schools Holidays : దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం-hyderabad telangana govt announces diwali christmas sankranti holidays to schools ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Telangana Govt Announces Diwali Christmas Sankranti Holidays To Schools

TS Schools Holidays : దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
Oct 04, 2023 04:12 PM IST

TS Schools Holidays : తెలంగాణ ప్రభుత్వం దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా సెలవులు ప్రకటించింది.

స్కూళ్లకు పండుగ సెలవులు
స్కూళ్లకు పండుగ సెలవులు

TS Schools Holidays : ఇటీవల దసరా, బతుకమ్మ పండుగలకు సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం బుధవారం దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగులకు కూడా సెలవులు ప్రకటించింది. దీపావళి పండుగకు ఒక్కరోజు సెలవు మాత్రమే ఇవ్వగా డిసెంబర్ నెలలో జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా ఐదు రోజుల సెలవులను ప్రకటించింది. కాగా కేవలం మిషనరీ పాఠశాలలకు మాత్రమే డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ఇతర పాఠశాలలకు క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25) మాత్రమే సెలవు ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

సంక్రాంతికి ఆరు రోజుల సెలవులు

దసరా దీపావళి పండుగల అనంతరం మరో పెద్ద పండుగ సంక్రాంతికి తెలంగాణ ప్రభుత్వం ఆరు రోజులు సెలవులు ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు మొత్తం ఆరు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఖరారు చేసింది. కాగా దసరా, బతుకమ్మల సందర్భంగా అక్టోబర్ 13 నుంచి 25 వరకు సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే.

దసరా సెలవులు

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ లో దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా, ఈసారి మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రజలు అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

IPL_Entry_Point