Hyderabad Bike Stunt : సోషల్ మీడియా రీల్స్ కోసం బైక్ స్టంట్స్, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Hyderabad Bike Stunt Crash : సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, రీల్స్ పేరిట పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు విషాదాంతం అవుతున్నాయి. హైదరాబాద్ లో బైంక్ స్టంట్ చేస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
Hyderabad Bike Stunt Crash : సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. రీల్స్ కోసం నిర్లక్ష్యంగా బైక్ స్టంట్ చేసిన యువకుడు మృతి చెందాడు. హయత్‌నగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటనలో పెవిలియన్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై అతి వేగంగా వెళ్తూ... రైడర్ బైక్ స్టంట్స్ చేయడానికి ప్రయత్నించాడు. స్టంట్స్ ను మరో వాహనంపై ఉన్న యువకుడు ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు. అసలే వర్షంతో రోడ్డు తడిసి ఉడడం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెనుక కూర్చొన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆదివారం మృతి చెందాడు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు దృశ్యాలు వైరల్
ఈ ప్రమాదానికి గల కారణాలపై హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ముందు యువకులు నిర్లక్ష్యంగా బైక్ స్టంట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైక్ స్టంట్ ప్రయత్నంలో ప్రమాదం జరిగిందా? లేదా సాధారణంగా రైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిందా? అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యంగా మోటర్ బైక్ రైడింగ్ కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా మత్తులో రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు యువకులను కోరుతున్నారు.
రీల్ చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి
ఫొటోలు, వీడియోల కోసం చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లి వీడియోలు తీస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవల ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా జలపాతం దగ్గర రీల్ చేస్తూ కింద పడిపోయింది. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆన్వీ కామ్‌దర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్నేహితులతో కలిసి ముంబయి దగ్గరలోని ఓ జలపాతం దగ్గరకు వెళ్లింది. జలపాతం దగ్గర తన మొబైల్ కెమెరాతో రీల్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆన్వీ కాలు జారి నేరుగా లోతైన లోయలో పడిపోయింది. ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు స్థానిక వ్యక్తులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే భారీ వర్షం వల్ల వారు అందులోకి దిగలేదు.
24 గంటల తర్వాత జులై 17న వర్షం తగ్గుముఖం పట్టడంతో, రెస్క్యూ టీమ్ లోయలోకి దిగగలిగింది. గంటల కొద్దీ వెతకగా ఆన్వీ మృతదేహాన్ని కనుగొన్నారు. రాళ్లు పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలై మృతి చెందింది. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఆన్వీకి రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా విస్తృతంగా గుర్తింపు పొందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం