Hyderabad : విదేశీ యువతులతో వ్యభిచారం..! గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు-hyderabad police bust prostitution racket at gachibowli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : విదేశీ యువతులతో వ్యభిచారం..! గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Hyderabad : విదేశీ యువతులతో వ్యభిచారం..! గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 29, 2025 11:22 AM IST

Gachibowli Prostitution Racket Busted : గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేయగా… ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు (representative image )
గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు (representative image ) (image source istockphoto.com)

హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ప్రాంతంలో  హైటెక్ వ్యభిచారం రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు.  మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లు తేలింది.

కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం తొమ్మిది మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

పక్కా సమాచారంతో…!

గుట్టుచప్పుడు కాకుండా టీఎన్‌జీవోస్‌ కాలనీలోని ఓ ఇంట్లో కొంతకాలంగా వ్యభిచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో  మంగళవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. దీంతో ఈ హైటెక్ సెక్స్ రాకెట్ బాగోతం బట్టబయలైంది. 

పోలీసుల రైడ్ జరిగిన సమయంలో నిర్వాహకులు పరారీ అయినట్లు తెలిసింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Whats_app_banner