Airtel 5G Network : 5జీ ఎక్కడ సర్ జీ.. ట్విట్టర్ గోడ ఎక్కిన హైదరాబాదోళ్లు
5G Network Issue : ఇటీవలే ఇండియాలోని ప్రధాన నగరాల్లో 5జీ మెుదలైంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. ఎన్నో ఆశల పెట్టుకున్న హైదరాబాద్ వాసులు ఇప్పుడు గరం గరంగా ఉన్నారు. 5జీ ఎక్కడ అంటూ ట్విట్టర్ గోడ ఎక్కుతున్నారు.
Hyderabad 5G Network : 5జీ నెట్ వర్క్ వస్తే.. ఇక ఎంచక్కా ఫాస్ట్ గా మెుబైల్ ఫోన్లో పనులు అయిపోతాయనుకున్నారు హైదరాబాద్(Hyderabad) వాసులు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. 5జీ(5G) సేవల కోసం వెయిట్ చేసిన భాగ్యనగర వాసులకు ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది. నగరంలో తిరిగి.. తిరిగి 5జీ నెట్ వర్క్ రాలేదంటూ.. ఫైర్ అవుతున్నారు ఇక్కడి లోకల్స్. '5జీ ప్లస్' పేరుతో హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా 8 నగరాలలో తమ 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
హమ్మయ్యా.. ఇక ఎంజాయ్ చేయోచ్చు అనుకున్న హైదరాబాద్ వాసులు.. ఎయిర్టెల్ పై సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి 5జీ మెుబైల్స్(5G Mobiles) వచ్చేశాయి. వాటిలో నెట్ వర్క్ కోసం ప్రయత్నిస్తే.. అస్సలు చప్పుడు లేదంట. ఇక మరికొంతమందేమో.. 5జీ ఫోన్లకు అప్ గ్రేడ్ అయి ఆశగా సిగ్నల్ పుల్లలను చూస్తున్నారు. కానీ ఏం లాభం లేదని తిట్టుకుంటున్నారు.
ఎక్కడ 5జీ సిగ్నల్ వస్తుందో చెప్పండయ్యా అంటూ.. ట్విట్టర్ గోడ(Twitter Wall)ల మీదకు ఎక్కారు హైదరాబాదోళ్లు. ఇప్పటివరకైతే.. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల గురించి ఎయిర్టెల్ అయితే ప్రకటించలేదు. దీంతో వినియోదారులు గందరగోళానికి గురవుతున్నారు. మాదాపూర్ లో ఓ ప్రైవేటు ఉద్యోగి.. ఎప్పుడు వస్తుందా 5జీ అని ఎదురుచూసి.. ఎదురుచూసి ఇక సైలెంట్ అయిపోయాడట. కనీసం 5జీ సిగ్నల్స్(5G Signals) అయినా అందించడంటూ.. సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. మీరు 5జీ హైస్పీడ్ ఇంటర్నెట్ తర్వాత ఇవ్వండని చెబుతున్నారు.
5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మీ మెుబైల్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి.. మీ సేవలను కొనసాగించవచ్చు. ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. పొరబాటున వాటిని ఓపెన్ చేస్తే అంతేసంగతులు. మీ సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ఫైల్‌ల ద్వారా పంపే లింక్‌లు వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేసే స్కామ్ లింక్‌లకు వినియోగదారులను తీసుకువెళతాయని సైబర్ నిపుణులు(Cyber Experts) తెలిపారు. దేశంలో 5G లాంచ్ అయిన కొద్ది రోజులకే 5G సేవల పేరుతో కస్టమర్లను మోసగించే సైబర్ నేరగాళ్లు పెరిగారని అధికారులు హెచ్చరిస్తున్నారు. దిల్లీ, ముంబై, హైదరాబాద్(Hyderabad)తో సహా 13 మెట్రో నగరాల్లోని మొబైల్ వినియోగదారులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 4G నుండి 5Gకి మారండి అనే లింక్‌లను ప్రజలకు పంపుతున్నారని అధికారులు తెలిపారు.
అయితే, APK (Android అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్‌ల ద్వారా పంపిన అటువంటి లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుల వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడే స్కామ్ లింక్‌లకు వినియోగదారులను తీసుకువెళతారని సైబర్ పోలీసులు(Cyber Police) హెచ్చరించారు. 'అవి మాల్‌వేర్ ఫైల్‌లు కాబట్టి, సైబర్ నేరగాళ్లకు రహస్య సమాచారాన్ని అందజేస్తూ సెల్‌ఫోన్(Cellphone)లోకి చొరబడతాయి. ఫోన్‌లో వ్యక్తిగత చిత్రాలు, ఇతర రహస్యాలు ఉంటే, సైబర్ నేరగాళ్లు వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయవచ్చు.' అని సైబర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.