Hyderabad Koti Deepotsavam:ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఏ డిపో నుంచి ఎన్నంటే?
Hyderabad Koti Deepotsavam Buses : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం జరిగే కోటి దిపోత్సవం కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తోన్నారు. కోటి దిపోత్సవానికి వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు సిటీలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోఠి బస్ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి ప్రతి రోజు 5000 మంది హాజరవుతారని అంచనా.
బస్సుల వివరాలు
1.ఉప్పల్ డిపో -113 I/M - ఎన్టీఆర్ స్టేడియం - 8 బస్సులు
2. ఉప్పల్ డిపో -113 K/L -ఎన్టీఆర్ స్టేడియం- 6 బస్సులు
3. కంటోన్మెంట్ డిపో-20P -ఎన్టీఆర్ స్టేడియం- 6 బస్సులు
4. హయత్ నగర్ డిపో1 - NGOS కాలనీ- ఎన్టీఆర్ స్టేడియం- 2 బస్సులు
5. హయత్ నగర్ డిపో2- NGOS కాలనీ-ఎన్టీఆర్ స్టేడియం- 2 బస్సులు
6.దిల్ సుఖ్ నగర్ - ఎన్టీఆర్ స్టేడియం- 4 బస్సులు
7.HPT - అల్వాల్ - ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
8.కూకట్ పల్లి -ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
9. మెహదీపట్నం- ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
10. కుషాయిగూడ- ECIL - ఎన్టీఆర్ స్టేడియం -4 బస్సులు
11. జీడిమెట్ల- ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
12.మేడ్చల్ - ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
13. మదీనాగూడ-ల్యాబ్ క్వార్టర్స్- ఎన్టీఆర్ స్టేడియం -4 బస్సులు
14. ఇబ్రహీంపట్నం - ఎన్టీఆర్ స్టేడియం -4 బస్సులు
15. హెచ్సీయూ -లింగంపల్లి- ఎన్టీఆర్ స్టేడియం- 4 బస్సులు
16. రాజేంద్రనగర్- శంషాబాద్ - ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
17. కాచిగూడ- కోటి -ఎన్టీఆర్ స్టేడియం - 4 బస్సులు
18.BDG- LB నగర్ -ఎన్టీఆర్ స్టేడియం- 4 బస్సులు
ఈ నెల 9 నుంచి 25 వరకు (కార్యక్రమ సమయాలు 05:00 నుంచి రాత్రి 10:00 వరకు)ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే దీపోత్సవం కార్యక్రమానికి వచ్చే భక్తుల రద్దీని నిర్వహణకు సాయంత్రం 04:00 నుంచి 11:30 గంటల వరకు పర్యవేక్షించడానికి టీజీఎస్ఆర్టీసీ అధికారులు నియమించింది.
అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరమశివుడి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది.
తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం