Hyderabad NIMS Jobs : 101 పోస్టుల భర్తీకి హైదరాబాద్ నిమ్స్ నోటిఫికేషన్ - మంచి జీతం, పూర్తి వివరాలివే
Hyderabad NIMS Recruitment 2024: హైదరాబాద్ నిమ్స్ (NIMS ) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీలోపు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. https://www.nims.edu.in/index వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను పొందటంతో పాటు పూర్తిస్థాయి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ, హైదరాబాద్.
- మొత్తం పోస్టులు - 101 (టెక్నీషియన్).
- ఖాళీల విభాగాలు: రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, అనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయో మెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు.
- అర్హతలు - సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.
- జీతం - నెలకు రూ.32,500 చెల్లిస్తారు.
- ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు.
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఉంటుంది. ఈ విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి డాక్యూమెంట్ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ లో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి.
- పూర్తి చేసిన దరఖాస్తులను "ది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెండో ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్యాంక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ - 500082
- అధికారిక వెబ్ సైట్ - https://www.nims.edu.in/recruitment?
నిమ్స్ లో కోర్సులు
మరోవైపు హైదరాబాద్ లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, హెల్త్ సైన్సెస్ లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ లో 100 సీట్లు, బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ డిగ్రీ(అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సుల్లో 100 సీట్లు భర్తీ చేయనున్నారు.
ఈఏపీసెట్ లో అర్హత సాధించిన వారు ఆగస్టు 23వ తేదీ లోపు ఆన్ లైన్ (https://www.nims.edu.in/)లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుల హార్డ్ కాపీలను ఆగస్టు 27వ తేదీ లోపు నిమ్స్ (The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad 500 082) సంబంధిత అడ్రస్ కు పంపాలి. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఈఏపీసెట్ లో ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా కోర్సులకు సంబంధించి మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
బీఎస్సీ నర్సింగ్ కోర్సు (మహిళలకు మాత్రమే). ఈ కోర్సులో 100 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్ లో బైపీసీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టులో జనరల్ అభ్యర్థులు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఓపెన్ స్కూల్ నుంచి సైన్స్ సబ్జెక్టులలో ఇంటర్ పాస్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. డిసెంబర్ 31, 2024 నాటికి 17-35 సంవత్సరాల మధ్య గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.