TS Genco Exam : తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా-hyderabad news in telugu tsgenco assistant engineer chemist exam postponed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Genco Exam : తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా

TS Genco Exam : తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా

Bandaru Satyaprasad HT Telugu
Dec 12, 2023 06:18 PM IST

TS Genco Exam : తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 17న ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జెన్ కో పరీక్షను వాయిదా వేసింది.

జెన్ కో పరీక్ష వాయిదా
జెన్ కో పరీక్ష వాయిదా

TS Genco Exam : తెలంగాణ జెన్ కో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్స్ పోస్టుల భర్తీకి అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 17న రాత నిర్వహించాలని నిర్ణయించింది. అయితే జెన్ కో తాజాగా ఈ పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష రోజున ఇతర పోటీ పరీక్షలున్నందున, జెన్ కో నిర్వహించే రాత పరీక్షను వాయిదా వేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలువురు అభ్యర్థులు కోరారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ రాత పరీక్షను వాయిదా వేయడానికి సమ్మతించింది. దీంతో తెలంగాణ జెన్ కో ఈ నెల 17న నిర్వహించాల్సిన రాత పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష తదుపరి షెడ్యూల్ ను www.tsgenco.co.in వెబ్ సెట్ లో తెలియజేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

399 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ జెన్‌కో లో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తామ‌ని జెన్ కో ప్రక‌టించారు. అయితే పలు కారణాలతో ఈ పరీక్ష వాయిదా ప‌డింది. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు పాత విద్యుత్ కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులుతో పాటు 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏఈ ఉద్యోగాల్లో చూస్తే లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జెన్ కో పేర్కొంది.

ఎంపిక విధానం

  • పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
  • జీతం - రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022).
  • హాల్‌టికెట్లు: పరీక్షకు 7 రోజుల ముందు
  • అధికారిక వెబ్ సైట్ - https://tsgenco.co.in/TSGENCO/home.do

రాత పరీక్ష

మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడుగుతారు.

టీ20 వరల్డ్ కప్ 2024