TS Inter Exams : ప్రశాంతంగా ఇంటర్ ఫస్టియర్ తొలి పరీక్ష- 19 వేల మంది గైర్హాజరు, 3 మాల్ ప్రాక్టీస్ కేసులు
TS Inter Exams : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయన్నారు.
TS Inter Exams : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం(TS Inter Exams) సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇవాళ జరిగిన పరీక్షకు మొత్తం 5,07,754 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 4,88,113 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 19,641 మంది విద్యార్థులు ఇవాళ్టి పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. కరీంనగర్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారులు నల్లగొండ, మెదక్, జనగామ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు వెళ్లి పరీక్షల తీరును పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్(Inter First Year Exams) మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలలో ఒక విద్యార్థిపైన మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయ్యింది. మొత్తం 795 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 48 పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ నిజామాబాద్ పట్టణంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలను, పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజియుద్దిన్ అస్లాం, దేవరాం 5 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆరు పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్క్వాడ్ లు 8 పరీక్ష కేంద్రాలను , ఫ్లైయింగ్ స్క్వాడ్లు 20 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. నవీపేట మోడల్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు.
బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 19,117 మంది విద్యార్థులకు గాను 795 మంది విద్యార్థులు హాజరు కాగా 18,322 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో జనరల్ 16,717 మంది విద్యార్థులకు గాను 609 మంది విద్యార్థులు హాజరుకాలేదు. కాగా 16,108 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ 2,400 మంది విద్యార్థులకు గాను 186 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 2,214 మంది విద్యార్థులు హాజరయ్యారు.
(రిపోర్టింగ్ : ఎమ్. భాస్కర్, నిజామాబాద్)
సంబంధిత కథనం