TS Govt Jobs : తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 4,356 టీచింగ్ పోస్టుల భర్తీ, ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీల్లో 4356 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TS Govt Jobs : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో(TS Medical Colleges Teaching Posts) అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం -వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లలో అక్టోబర్ 2021 నుంచి ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ పోస్టులను(Teaching Posts) కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన (Contract Outsourcing Jobs)భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానరసింహ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పోస్టుల భక్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిలో భాగంగా 4,356 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ జీవోను విడుదల చేసిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో వెల్లడించారు. 3155 కాంట్రాక్టు సిబ్బంది, గౌరవ వేతనంతో 1201 బోధనా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు.
పోస్టుల వివరాలు ఇలా
ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, బోధనా సిబ్బంది 1,201 పోస్టులను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narasimha) ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం 634 కోట్ల 48 లక్షల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6,958 స్టాప్ నర్సుల (Staff Nurse Jobs)నియామకాల్లో భాగంగా మెడికల్ కాలేజీల్లో నియమకాలు చేపట్టామన్నారు. వైద్య కళాశాలలకు అనువైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య విద్యను రాష్ట్రంలో అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాహసపేతమైన నిర్ణయం వల్ల చేపట్టిన నియామకాల ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.
డైరీని ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ల అధ్వర్యంలో 2024 డైరీ & టేబుల్ క్యాలెండర్ లను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ రెవెన్యూ అధికారులకు ఎంతో ఉపయుక్తంగా రూపొందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, రాష్ట్ర తహశీల్దార్స్ అసోసియేషన్ మహిళ విభాగం అధ్యక్షురాలు రాధను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
సంబంధిత కథనం