TS Media Academy Chairman : తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి నియామకం-hyderabad news in telugu senior journalist k srinivas reddy appointed as ts media academy chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad News In Telugu Senior Journalist K Srinivas Reddy Appointed As Ts Media Academy Chairman

TS Media Academy Chairman : తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి నియామకం

Bandaru Satyaprasad HT Telugu
Feb 25, 2024 04:12 PM IST

TS Media Academy Chairman : సీనియర్ జర్నలిస్ట్, ప్రజాపక్షం దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

TS Media Academy Chairman : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డిని(K Srinivas Reddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ప్రజా పక్షం దినపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణలో నూతన సర్కారు ఏర్పడిన తర్వాత నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. ఇలా ఖాళీ అయిన నామినేటెడ్‌ పోస్టులను కొత్త వారితో భర్తీ చేస్తుంది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌(TS Media Academy Chairman)గా శ్రీనివాస్‌ రెడ్డి నియమించింది. రెండేళ్లపాటు శ్రీనివాస్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. శ్రీనివాస్ రెడ్డి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలోనూ ఆయన ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సేవలు అందించారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిచింది. ఇప్పటి వరకు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా అల్లం నారాయణ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో విశాలాంధ్ర పత్రిక ఎడిటర్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. గతంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ గా సేవలు అందించారు.

IPL_Entry_Point