Trains Cancelled : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 305 రైళ్లు రద్దు-hyderabad news in telugu michaung cyclone effect rains south central railway cancelled 305 trains hydrabad cyclone ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad News In Telugu Michaung Cyclone Effect Rains South Central Railway Cancelled 305 Trains Hydrabad, Cyclone

Trains Cancelled : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 305 రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 02:14 PM IST

Trains Cancelled : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ నుంచి దక్షిణాది వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రద్దు

Trains Cancelled : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలోని పలు జిల్లాకు రెడ్ అలెర్ట్

తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇప్పటికే 150 రైళ్లు రద్దు చేశారు. అయితే తాజాగా రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ నుంచి దక్షణాది వైపు వెళ్లే రైళ్లు అన్నీ రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మొత్తం 305 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. రైళ్ల రద్దు ఈ నెల 2 నుంచి 8 వరకు ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

తుపాను నేపథ్యంలో రైలు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. రైలు నిలయం నుంచి జోన్ పరిధిలోని ఆరు డివిజన్ల అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.

ప్రయాణికులకు హెల్ప్ లైన్ నంబర్లు

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ లలో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ - 040-27686666,040-27801112

హైదరాబాద్ - 9676904334

కాచిగూడ - 040-27784453

కాజీపేట - 0870-2576440

ఖమ్మం - 7815955306

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

WhatsApp channel