CM Revanth Reddy : ఇవాళే గేట్లు ఓపెన్ చేశాం, ఇక నా రాజకీయం చూపిస్తా- సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy says congress opens gate for other party leaders joins ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఇవాళే గేట్లు ఓపెన్ చేశాం, ఇక నా రాజకీయం చూపిస్తా- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఇవాళే గేట్లు ఓపెన్ చేశాం, ఇక నా రాజకీయం చూపిస్తా- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Mar 17, 2024 02:13 PM IST

CM Revanth Reddy : కాంగ్రెస్ లో చేరికలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళే గేట్ ఓపెన్ చేశామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 'ఇవాళ ఉదయమే గేట్ ఓపెన్ చేశాం కాసేపట్లో మీరే చూస్తారు'... పార్టీలో చేరికలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనపై హైదరాబాద్ (Hyderabad)లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్(BJP BRS) పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నా రాజకీయం ఏంటో చూపిస్తానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender), ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy)ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గేట్ ఓపెన్ చేశామన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై

హైదరాబాద్(Hyderabad) విమోచన దినానికి, 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఏడు తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించిన విధంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. ఇన్నాళ్లు సీఎంగా చూశారని, ఇవాళ్టి నుంచి నేనేంటో చూస్తారని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఇక పీసీసీ చీఫ్ గా పని మొదలు పెట్టానన్నారు. పేపర్లు అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలు ఆగం చేసినప్పుడు మాకేం సంబంధంలేదని చెప్పిన హరీశ్ రావు(Harish Rao), కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇస్తుంటే మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుందని ఈటల రాజేందర్(Etela Rajender) ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందిస్తూ..చిల్లర ఆరోపణలు సరికాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వమే కదా ఉంది? విచారణ చేయించాలన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశాం?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)ఉద్యోగంలో ఉంటే డీజీపీ అయ్యేవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ (TSPSC Chairman)పదవిని ఆఫర్ చేశామని, కానీ ఆయన తిరస్కరించారన్నారు. ఆర్ఎస్ కేసీఆర్(KCR) తో చేరితే ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఇక రైతు భరోసాపై ఆందోళన వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)...గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని స్పష్టం చేశారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. తప్పు చేసిన అధికారులు మాత్రం విచారణ ఎదుర్కోవాలన్నారు. అధికారులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టమన్నారు. ఎన్నికల సమయంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి... లోక్ సభ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందన్నారు. ఇవాళే గేట్లు ఓపెన్ చేశామని, అవతల ఖాళీ అయితే ఆటోమేటిక్ గా గేట్లు క్లోజ్ అవుతాయన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామన్నారు. అవసరంలేని వాళ్లను తొలగిస్తామన్నారు.

కొండలు, గుట్టలకు రైతు భరోసా బంద్

ధరణిపై(Dharani) ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తే విషయాలు బయటపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పులకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టమన్నారు. కొండలు, గుట్టలు, లేఅవుట్లకు రైతు భరోసా(Rythu Bharosa) ఇచ్చేది లేదన్నారు. నిధుల దుర్వినియోగం జరగుకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. నిధుల దుబారా, ఆర్భాట ఖర్చులు పెట్టమన్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అలాంటి వాటిపై దృష్టి పెట్టి రాష్ట్ర ఆదాయం పెంచుతామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం