Minister Harish Rao : మరో రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ - మంత్రి హరీశ్ రావు-hyderabad minister harish rao says 80k govt jobs recruitment process going on in state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Minister Harish Rao Says 80k Govt Jobs Recruitment Process Going On In State

Minister Harish Rao : మరో రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ - మంత్రి హరీశ్ రావు

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2023 01:53 PM IST

Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం వైద్య ఆరోగ్య శాఖలో 22,263 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ శాఖలో కొత్తగా నియమితులైన 1061 మందికి మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందించారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేసిన ఐదు నెలల్లోనే పూర్తి చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో... వైద్యారోగ్య శాఖ‌లో కొత్తగా జూయిన్ అవుతున్న అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లకు నియామ‌క ప‌త్రాల‌ు అందించారు మంత్రి హ‌రీశ్‌రావు. 1,061 మంది వైద్యుల‌కు జూయినింగ్ లెటర్స్ అందించిన మంత్రి హ‌రీశ్‌రావు...వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ...కొత్తగా నియామ‌క‌మైన వైద్యులు డీఎంఈ పరిధిలో పనిచేయనున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల చొప్పున నిర్మిస్తుందన్నారు. ఈ కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వైద్యశాఖ ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. కొత్త నియామకాలతో వైద్యవిద్య మరింత బలోపేతం అవుతుందని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఐదు నెలల్లోనే పోస్టుల భర్తీ

గత ఏడాది డిసెంబర్ 6న వైద్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 34 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. వీటిల్లో మల్టీ జోన్‌-1లో 574 పోస్టులు, మల్టీజోన్‌-2లో 573 పోస్టులున్నాయి. అయితే డిసెంబర్‌ 20 నుంచి జనవరి 12 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అప్లికేషన్ల పరిశీలన అనంతరం.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఫిబ్రవరి 20న రోస్టర్‌ జాబితా, మార్చి 28న ప్రైమరీ మెరిట్‌ జాబితా విడుదల చేశారు. అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత... ఏప్రిల్ 8న తుది జాబితాను విడుదల చేశారు. తుది ప్రక్రియ అనంతరం 1,061 మందిని ఎంపిక‌ చేసినట్లు ప్రకటించారు. వైద్య ఆరోగ్యశాఖకు ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

తర్వలో 9222 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వైద్యరంగంలో పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో విడుదలైన పలు నోటిఫికేషన్ల కింద 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. అదే విధంగా 1,331 మంది ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 22,263 మందికి వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 9,222 పోస్టుల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారని, వీటిని పెంచుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో తొమ్మిది కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 80 వేల వరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

WhatsApp channel