హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్, భారీగా పెరిగిన టికెట్ ధరలు-hyderabad metro ticket price hike shocking increase for commuters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్, భారీగా పెరిగిన టికెట్ ధరలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్, భారీగా పెరిగిన టికెట్ ధరలు

హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెంచుతున్నట్లు మెట్రో ప్రకటించింది.

హైదరాబాద్ వాసులకు షాక్, భారీగా పెరిగిన మెట్రో టికెట్ ధరలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ధరల షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచింది. ఛార్జీల్లో పెంపు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెంచుతున్నట్లు మెట్రో ప్రకటించింది.

కొత్త ఛార్జీలు

  • 1-2 స్టాప్‌లకు- రూ.12
  • 2-4 స్టాప్‌లకు-రూ.18
  • 4-6 స్టాప్‌లకు- రూ.30
  • 6-9 స్టాప్‌లకు - రూ.40
  • 9-12 స్టాప్‌లకు- రూ.50
  • 12-15 స్టాప్‌లకు- రూ.55
  • 15 -18 స్టాప్‌లకు- రూ.60
  • 18 -21 స్టాప్‌లకు-రూ.66
  • 21-24 స్టాప్‌లకు-రూ.70
  • 24 స్టాప్‌లు ఆపైన- రూ.75

హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ మెట్రో నియమించారు. దీంతో ఉద్యోగ, వ్యాపారస్తులు సకాలంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎక్కువగా మెట్రో సేవలను వినియోగించుకుంటారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, నాగోలు నుంచి రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలులో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

గతంలోనే ప్రతిపాదన

మెట్రో నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఛార్జీల పెంపు ప్రతిపాదన గతంలోనే రాగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గతంలో ఛార్జీల పెంపు ప్రతిపాదనను మెట్రో రైలు విరమించుకుంది. అయితే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు నష్టాలు పెరుగుతుండడంతో ఛార్జీల పెంపు అనివార్యమైందని యాజమాన్యం పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మే 17 నుంచి పెంపు వర్తింపు

హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుందని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మే 10 తర్వాత మెట్రో ఛార్జీల పెంపు తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగా మే 17 నుంచి ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని మెట్రో తెలిపింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం అమలుచేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. మెట్రో రైలు నష్టాలకు ఇదొక కారణమని ఎల్ అండ్ టీ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం