Hyd Metro Signal Issues: హైదరాబాద్‌ మెట్రో సిగ్నలింగ్ సమస్యలు.. బ్లూ లైన్‌లో నిలిచిన మెట్రో సేవలు-hyderabad metro signaling problems train services halted on blue line ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Metro Signal Issues: హైదరాబాద్‌ మెట్రో సిగ్నలింగ్ సమస్యలు.. బ్లూ లైన్‌లో నిలిచిన మెట్రో సేవలు

Hyd Metro Signal Issues: హైదరాబాద్‌ మెట్రో సిగ్నలింగ్ సమస్యలు.. బ్లూ లైన్‌లో నిలిచిన మెట్రో సేవలు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 29, 2025 10:00 AM IST

Hyd Metro Signal Issues: హైదర్‌బాద్‌ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. నాగోల్‌ నుంచి రాయదుర్గం వెళ్లే బ్లూ లైన్‌ ‌లో సిగ్నలింగ్ సమస్యలు తలెత్తడంతో బుధవారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగింది. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది.

హైదరాబాద్‌ మెట్రోకు సాంకేతిక సమస్య, నిలిచిన రైళ్లు
హైదరాబాద్‌ మెట్రోకు సాంకేతిక సమస్య, నిలిచిన రైళ్లు (@Kavalichandrak1)

Hyd Metro Signal Issues:  సిగ్నలింగ్ సమస్యలతో హైదరాబాద్‌ మెట్రో రైల్ సర్వీసుల్లో ఇబ్బందులు తలెత్తాయి.  నాగోల్‌ -రాయదుర్గం బ్లూ లైన్‌లో సమస్యలు తలెత్తడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు మందగించడంతో  మిగిలిన మార్గాల్లో రద్దీ పెరిగి పోయింది. మెట్రో సర్వీసులకు బుధవారం ఉదయం నుంచి అంతరాయం కలిగింది. గతంలో కూడా ఈ తరహా సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే సరిచేయగలిగారు. తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసేందుకు ఎల్‌ అండ్ టి ప్రయత్నిస్తోంది.

yearly horoscope entry point

బ్లూ లైన్‌ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో మిగిలిన కారిడార్లలో కూడా అంతరాయం ఏర్పడింది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కనెక్టింగ్ సర్వీసులను అందుకోలేక  ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు మెల్లగా నడుస్తుండటంతో గమ్యస్థానాలకు చేరుకోడానికి అవస్థలు పడుతున్నారు. అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ,  మియాపూర్‌- ఎల్‌బి నగర్‌ మధ్య పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు.  కొన్ని స్టేషన్లకు రైళ్లు రాకపోవడంతో ప్రయాణికులు భారీగా నిరీక్షిస్తున్నారు. 

 

Whats_app_banner