Hyderabad Metro Recruitment: హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు - అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే -hyderabad metro rail issued recruitment notification for various posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Metro Rail Issued Recruitment Notification For Various Posts

Hyderabad Metro Recruitment: హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు - అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 05:42 PM IST

Hyderabad Metro Jobs 2023: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య, అర్హతలతో పాటు పలు వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు
హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు

Hyderabad Metro Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్. చాలా రోజుల తర్వాత పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల వివరాలు, అర్హతలు, ఉద్యోగాల దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో వివరాలను పేర్కొంది. వాటిని చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

సంస్థ - హైదరాబాద్ మెట్రో రైల్

పోస్టుల సంఖ్య - 12

ఉద్యోగాల వివరాలు :

AMS officer / Maximo - Maintenance 1

Signalling Team Leader - Maintenance 2

Rolling Stock Team Leader - Maintenance 6

Tracks Team Leader - Maintenance 2

I.T Officer - Maintenance 1

అర్హతలు - పోస్టులను అనుసరించి విద్యార్హతలను ప్రకటించారు. ఏఎంఎస్ ఆఫీసర్ పోస్టుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. సిగ్నలింగ్ టీమ్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. అనుభవం కూడా తప్పనిసరి. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ పాస్ కావాలి. అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం - ఈమెయిల్ ద్వారా చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాలి. Current Oppurtunities అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత... KeolisHyd.Jobs@keolishyderabad.com పంపాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం