Bigg Boss Is Watching You : మెట్రో స్టేషన్లలో బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారు-hyderabad metro rail and bigg boss campaign for passengers safety here s travel safety instructions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Metro Rail And Bigg Boss Campaign For Passengers Safety Here's Travel Safety Instructions

Bigg Boss Is Watching You : మెట్రో స్టేషన్లలో బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారు

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 03:44 PM IST

Bigg Boss Season 6 Telugu : ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారని(Bigg Boss Is Watching You) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

బిగ్ బాస్ వాచింగ్ యూ పోస్టర్
బిగ్ బాస్ వాచింగ్ యూ పోస్టర్ (twitter)

ప్రయాణికుల సెఫ్టీ కోసం హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ షో(Bigg Boss Show)తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారు'(Bigg Boss Is Watching You) అనే ప్రచారాన్ని మెుదలుపెట్టింది. పబ్లిక్ సేఫ్టీ(Public Safety) అవేర్ నేస్ క్యాంపెయిన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఎల్అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ నాగర్జున పోస్టర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

మెట్రో రైలులో ప్రయాణించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు బిగ్ బాస్(Bigg Boss) ఈజ్ వాచింగ్ యూ ప్రచారాన్ని మెుదలుపెట్టారు. నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో కాన్ కోర్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్, చెక్ ఇన్ ప్రాంగణాల్లో ప్రచారం చేస్తారు. ఈ క్యాంపెయిన్ బిగ్ బాస్ సీజన్ లో మెుత్తం 100 రోజులు జరుగుతోంది. ప్రత్యేకమైన సందేశాలను అన్ని మెట్రో స్టేషనల్లో ప్రచారం చేస్తున్నారు.

ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటుగా మెట్రో(Metro) ప్రాంగణంలో పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. మెట్రోలో ప్రయాణించాలనుకునేవారు తప్పనిసరిగా సూచనలు పాటించాలి. ఒక ప్లాల్ ఫారమ్ నుంచి మరో మరో ప్లాట్ ఫారమ్ వెళ్లేందుకు లిఫ్ట్, మెట్లు, ఎస్కలేటర్ ను మాత్రమే ఉపయోగించాలి. పట్టాలపైకి వెళ్లొద్దు. మెట్రో రైలు ప్లాట్ ఫారమ్ వద్ద పసుపు గీతలను దాటకూడదు. బోర్డింగ్, డీబోర్డింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకూడదు. మీరు ఎక్కే ముందు ప్రయాణికులు దిగే వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి సందేశాలు బిగ్ బాస్ ఈజ వాచింగ్ యూ(Bigg Boss Is Watching You) ద్వారా చెబుతున్నారు.

స్టార్ మా బిగ్ బాస్(Star Maa Bigg Boss)తో విజయవంతంగా మూడో సంవత్సరం భాగస్వామ్యం చేసుకున్నాం. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ యూ ప్రచారం మెుదలుపెట్టాం. దీంతో భద్రతా అవగాహన, సురక్షిత ప్రయాణంపై ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. స్మార్ట్ ట్రావెల్(Smart Travel) అలవాట్లను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మెట్రో ప్రయాణికులు మెుబైల్ క్యూఆర్ టికెట్స్, స్మార్ట్ కార్డులు వినియోగించాల్సిందిగా కోరుతున్నాం.

- ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి

'వినోదంతోపాటుగా ఓ మంచి సందేశం ఉండాలి. ఈ ప్రచారం అందుకోసం ఉపయోగపడుతుంది. బిగ్ బాస్(Bigg Boss) వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. మెట్రో రైలు ప్రచారం ద్వారా మరింత అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు ఉపయోగపడనుంది. ఇలాంటి బాధ్యతయుత ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది.' అని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగర్జున(Akkineni Nagarjuna) అన్నారు.

WhatsApp channel