గోవా క్యాసినోలో సెక్యూరిటీ గార్డును హతమార్చిన హైదరాబాద్ యువకుడి అరెస్టు-hyderabad man kills security guard in fit of rage at goa casino police says ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గోవా క్యాసినోలో సెక్యూరిటీ గార్డును హతమార్చిన హైదరాబాద్ యువకుడి అరెస్టు

గోవా క్యాసినోలో సెక్యూరిటీ గార్డును హతమార్చిన హైదరాబాద్ యువకుడి అరెస్టు

HT Telugu Desk HT Telugu

గోవాలోని పనాజీలో ఒక క్యాసినో లాబీలో సెక్యూరిటీ గార్డును హత్య చేసి, మరొకరిని గాయపరిచిన 25 ఏళ్ల హైదరాబాద్ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

గోవాలో హత్య (Representative file photo)

పనాజీ, గోవా: గోవాలోని పనాజీలో ఒక క్యాసినో లాబీలో సెక్యూరిటీ గార్డును హత్య చేసి, మరొకరిని గాయపరిచిన 25 ఏళ్ల హైదరాబాద్ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ఆ పర్యాటకుడు తీవ్ర ఆగ్రహంతో, ఒక చివర లోహపు బిగింపు ఉన్న చెక్క కర్రను తీసుకుని, దానితో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో క్యాసినో సెక్యూరిటీ గార్డును కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

"ఈ దాడి ఫలితంగా ధీరు శర్మ (33) అనే గార్డు గాయాలతో బొంబోలింలోని గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరణించాడు. మరొక గార్డు సుభాష్ గావొంకర్ (27) తలకు గాయాలతో చికిత్స పొందుతున్నాడు" అని ఉత్తర గోవా పోలీసు సూపరింటెండెంట్ (SP) రాహుల్ గుప్తా తెలిపారు. శర్మ మధ్యప్రదేశ్‌కు చెందినవాడు కాగా, గావొంకర్ దక్షిణ గోవాలోని శిరోడా నివాసి.

నిందితుడి అరెస్టు:

"పోలీసు బృందం నిందితుడు అబ్దుల్ అల్తాఫ్‌ను విజయవంతంగా పట్టుకుంది. అతను అరెస్టు నుండి తప్పించుకోవడానికి డాబోలిమ్ విమానాశ్రయం వైపు వెళుతుండగా అడ్డగించారు" అని గుప్తా చెప్పారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, అల్తాఫ్ హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని మిస్రి గంజ్‌కు చెందినవాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 'హిస్టరీ షీటర్'గా పేరుంది. అతను బుధవారం సాయంత్రం క్యాసినోకు వెళ్ళాడు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.