Kothur Accident Video : ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి, కొత్తూరు రోడ్డు ప్రమాదం వీడియో వైరల్
Kothur Accident Video : హైదరాబాద్ కొత్తూరు వై జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒకరి నిర్లక్ష్యం కారణంగా మరొకరు ప్రాణం కోల్పోయారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. పాతబస్తీ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లి వారికి అనుకోని సంఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఉదయ్ సింగ్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన ఉదయ్ సింగ్ ఠాకూర్ (53) డ్రైవర్, ట్రావెల్ ఏజెంట్ గా చేస్తున్నారు. ఉదయ్ సింగ్ తీర్థ యాత్రలకు బస్సు ట్రిప్ లు నడుపుతుంటారు. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మరో 23 మందితో కలిసి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలకు టూర్ కు వెళ్లారు. ఈ యాత్రలో ఉప్పుగూడ శివాజీ నగర్ కు చెందిన నిత్యశ్రీ ట్రావెల్స్‌కు చెందిన 22 సీటర్ ఎస్‌ఎంఎల్ బస్సు డ్రైవర్ మల్లేష్ తో మాట్లాడుతున్నారు.
జులై 8న హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ నుంచి ఉదయ్ సింగ్, తన భార్య విజయ, కూతురు స్రవంతి, కుమారుడు వినీత్ లతోపాటు మరో 19 మందితో కలిసి నార్త్ ఇండియా టూర్ కు బయలుదేరారు. తెలంగాణ మీదుగా ఏపీ మధ్యలో ఉన్న పుణ్య క్షేత్రాలను చూసుకుంటూ ఈ నెల 12న పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్లారు. ఒడిశాలోని బాలాపూర్ మీదుగా బిహార్ కు వెళ్తోన్న క్రమంలో మయూరభంజ్ జిల్లా బెత్తోనటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

సంబంధిత కథనం