జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్-hyderabad jubilee hills by election schedule released heres important dates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్

Anand Sai HT Telugu

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఎన్నికల సంఘం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది .

ఉప ఎన్నిక ప్రకటనతో నగరంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 13 నుండి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్‌ విడుదల-అక్టోబర్‌ 13

నామినేషన్లకు తుది గడువు-అక్టోబర్‌ 21

నామినేషన్ల పరిశీలన-అక్టోబర్‌ 22

నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు-అక్టోబర్‌ 24

పోలింగ్‌ తేదీ-నవంబర్‌ 11

ఓట్ల లెక్కింపు-నవంబర్‌ 14

ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి (BRS) సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.

ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది . అయితే, కాంగ్రెస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కొన్ని పేర్లు వినిపిస్తున్నా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 24, 2024న ప్రమాదంలో మరణించిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.

ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జూన్ 2024లో జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన టిఎన్ వంశ తిలక్‌పై 13,206 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నివేదిత 34,462 ఓట్లు సాధించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.