Journalists Houses : జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, హౌసింగ్ సొసైటీ జేఏసీ డిమాండ్-hyderabad journalist housing society demands houses for all journalists met media academy chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Journalists Houses : జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, హౌసింగ్ సొసైటీ జేఏసీ డిమాండ్

Journalists Houses : జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, హౌసింగ్ సొసైటీ జేఏసీ డిమాండ్

Bandaru Satyaprasad HT Telugu
Aug 26, 2024 06:27 PM IST

Journalists Houses : జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జేఏసీ బృందం మీడియా అకాడమీ ఛైర్మన్ ను కలిసి వినతి పత్రం అందించాయి. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సొసైటీలకతీతంగా కలిసి పోరాడాలని జేఏసీ నిర్ణయించింది.

జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ
జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ

Journalists Houses : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇప్పించాలని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి. హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల జేఏసీ సోమవారం భేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ సభ్యుల బృందం... జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సొసైటీలకతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మీడియా అకాడమీ ఛైర్మన్ హామీ

త్వరలో జర్నలిస్టులతో జరిగే ముఖ్యమంత్రి సభలో శుభవార్త అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యుల వినతికి మీడియా అకాడమీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం సీఎంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీశాట్ ఛైర్మన్ బి.వేణుగోపాల్ రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు బ్రహ్మండబేరి గోపరాజు, భీమగాని మహేశ్వర్,ఎం.సూరజ్ కుమార్ , సి.హెచ్ .రాకేష్ రెడ్డి, బి.రవి, ఎం.శ్రీనివాస్ , అయ్యప్ప, రామకృష్ణ, శిగ శంకర్ గౌడ్, సునీత, రవీంద్రబాబు పాల్గొన్నారు.

సంబంధిత కథనం